Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'సర్ఫరాజ్ డ్రింక్స్ మోయడం తప్పేమికాదు.. కెప్టెన్‌గా ఉండి నేను కూడా మోశాను'

Coach Misbah ul Haq responds on being criticised for making Sarfaraz Ahmed carry drinks for players

కరాచీ: మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో పాకిస్థాన్‌ తొలి టెస్టు ఆడుతున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌ టూర్‌కి మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఎంపిక అయినా.. తొలి టెస్టు తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకులేకపోయాడు. అతని స్థానంలో యువ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌‌కి పాక్ మేనేజ్మెంట్ ఛాన్స్ దక్కింది. తొలి టెస్టు మ్యాచ్‌కి తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సర్ఫరాజ్.. తొలి రోజు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే రెండో రోజు సహచరుల కోసం మైదానంలోకి డ్రింక్స్ తీసుకొస్తూ బిజీ బిజీగా గడిపాడు.

వాటర్ బాయ్ అవతారం:

వాటర్ బాయ్ అవతారం:

గురువారం సర్ఫరాజ్ అహ్మద్ కాసేపు వాటర్ బాయ్ అవతారం ఎత్తాడు. ఓపెనర్ షాన్ మసూద్‌కు డ్రింక్స్ అందించేందుకు సర్ఫరాజ్ వచ్చాడు. సర్ఫరాజ్‌‌‌తో డ్రింక్స్ మోయించడంపై పాక్ అభిమానులు మండిపడుతున్నారు. బెంచ్‌పై జూనియర్లని కూర్చోబెట్టి.. సర్ఫరాజ్‌ని అలా మైదానంలోకి వాటర్ బాయ్‌‌గా పంపడం అతడ్ని అవమానించడమే అని కొందరు మండిపడ్డారు. తొలి టెస్టు కోసం ఎంపిక చేయలేదు సరే.. ఇలా డ్రింక్స్ మోపించడం సరైంది కాదని మరికొందరు అంటున్నారు. దిగ్గజ ఆటగాళ్లు కూడా సహచరుల కోసం డ్రింక్స్ తెచ్చారు.. సర్ఫరాజ్ తెస్తే ఏమైంది అని ఇంకొందరు పేర్కొన్నారు.

కెప్టెన్‌గా ఉండి నేను కూడా మోశా:

కెప్టెన్‌గా ఉండి నేను కూడా మోశా:

సర్ఫరాజ్ అహ్మద్‌తో డ్రింక్స్ మోయించడంపై విమర్శలు రావడంతో పాకిస్థాన్ చీఫ్ కోచ్, చీఫ్ సెలక్టర్ మిస్బావుల్ హక్ ఘాటుగా స్పందించాడు. 'క్రికెటర్ డ్రింక్స్ మోయడం చాలా సాధారణ విషయం. బహుశా సర్ఫరాజ్ అహ్మద్‌ కూడా ఈ విషయంలో ఫీల్ అవలేదు. ఆస్ట్రేలియాతో సిరీస్ సమయంలో నేను కెప్టెన్‌గా ఉండి కూడా ఓ మ్యాచ్‌లో డ్రింక్స్ మోశా. డ్రింక్స్ మోయడం తప్పేమీకాదు' అని కోచ్ బదులిచ్చాడు.

ఫన్నీగా భారత ఫ్యాన్స్:

ఫన్నీగా భారత ఫ్యాన్స్:

మరోవైపు సర్ఫరాజ్ అహ్మద్‌ డ్రింక్స్ మోయడాన్ని పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు అవమానంగా ఫీలవుతుండటంపై భారత ఫ్యాన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. గతంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా సహచరుల కోసం వాటర్ బాయ్‌గా మారారు.. వారికంటే సర్ఫరాజ్ గొప్పవాడా? అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. బెంచ్‌లోని ఆటగాళ్లు డ్రింక్స్ తీసుకుపోవడం సాధారణం, ఎందుకంత సీన్ చేస్తున్నారు? అని మరికొందరు అడుగుతున్నారు. అంతర్జాతీయ కెరీర్‌లో సర్ఫరాజ్ ఇప్పటివరకు 49 టెస్టుల్లో, 116 వన్డేల్లో, 58 టీ20 మ్యాచ్‌ల్లో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ఒక్క ఆవలింత ఎంతపనిచేసే:

ఒక్క ఆవలింత ఎంతపనిచేసే:

ఏప్రిల్ 2016న సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్థాన్ జట్టు టీ20 కెప్టెన్‌గా నియమింపబడ్డాడు. ఆ తర్వాత 2017లో వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. 2017లో వెస్టిండిస్ పర్యటనలో పాకిస్థాన్ జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించడంతో.. ఆ తర్వాత మూడు ఫార్మాట్లకు అతడినే కెప్టెన్‌గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇక సర్ఫరాజ్ ఫామ్ కంటే ఫిట్‌నెస్ గురించే గత ఏడాది కాలంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ల వెనుక సర్ఫరాజ్ ఆవలింతలు తీయడం అప్పట్లో పెద్ద దుమారమే లేపింది. పాక్ క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత పేలవ ఫిట్‌నెస్ ఉన్న కెప్టెన్ సర్ఫరాజ్ అని ఆ దేశ మాజీలు విమర్శించారు. ఇక ఫాన్స్ అయితే అతడిని జట్టు నుంచి ఇప్పుడే తీసేయాలని పట్టుబట్టారు. ఆ ఒక్క కారణంతో మూల్యం చెల్లనుంచుకున్నాడు.

Story first published: Friday, August 7, 2020, 14:31 [IST]
Other articles published on Aug 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+