సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగే చివరి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే దానిపై భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టత ఇచ్చాడు. చివరి టెస్ట్ లో రోహిత్ శర్మ ఆడడంపై క్లారిటీ ఇవ్వలేదు. పెర్త్‌లో జరిగిన సిరీస్ మొదటి టెస్ట్ విజయం టీమిండియా మిగతా మూడు మ్యాచ్ ల్లో రెండింటిలో ఓడిపోగా ఒక మ్యాచ్ డ్రా అయింది. దీంతో ఆసీస్ సిరీస్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
మిగతా మూడు మ్యాచ్ ల్లో కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అతను ఈ మూడింటిలో విఫలం అయ్యాడు. దీంతో రోహిత్ చివరి టెస్ట్ అడతాడా లేదా అనేది చర్చ జరిగింది. అయితే గంభీర్ మాత్రం రోహిత్ ఆడడంపై స్పష్టత ఇవ్వలేదు. "రోహిత్‌తో అంతా బాగానే ఉంది. చివరి టెస్ట్ లో రోహిత్ ఆడతాడు" అని గంభీర్ పేర్కొన్నాడు. చివరి టెస్ట్ లో ఎవరు ఆడబోతున్నారని ప్రశ్నకు బదులిస్తూ " మేము వికెట్‌ని పరిశీలించి, మా ప్లేయింగ్ XIని రేపు ప్రకటిస్తామ" అని చెప్పాడు.

కాగా రోహిత్ శర్మ ఈ సిరీస్ ఘోరంగా విఫలమయ్యారు. సీజన్‌లో అతను ఇప్పటివరకు ఆడిన మూడు సిరీస్‌లలో వాటిలో రెండు స్వదేశంలో జరిగాయి. రోహిత్ 15 ఇన్నింగ్స్‌లలో కేవలం 10.93 సగటుతో 164 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో కేవలం 31 పరుగులే చేశాడు. ఒకసారి మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. దీంతో అతనిపై వేటు వేయాలని డిమాండ్ పెరిగింది.
మరోవైపు రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదని మరి కొంతమంది సూచిస్తున్నారు. అయితే అయితే రోహిత్ శర్మకు మొదటి నుంచి టెస్ట్ క్రికెట్ లో రికార్డులు ఏమి లేవు. అతను వన్డే, టీ20 బాగా ఆడతాడని విశ్లేషకులు చెబుతున్నారు. రోహిత్ ఇప్పటి వరకు కేవలం 67 టెస్ట్ లు మాత్రమే ఆడాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. ఒకసారి డబుల్ సెంచరీ కూడా చేశాడు. వన్డేల్లో మాత్రం రోహిత్ కు ఘనమైన రికార్డు ఉంది. వన్డేల్లో మూడుసార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా ఉన్నాడు.