For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'శాంసన్‌ రెండు ఐపీఎల్‌లలో రాణిస్తే.. 2021 టీ20 ప్రపంచకప్‌ ఆడతాడు'

Coach Biju George said Sanju Samson will definitely perform in IPL

ముంబై: వరుసగా రెండు ఐపీఎల్‌ సీజన్‌లలో సంజూ శాంసన్‌ రాణిస్తే.. 2021లో జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకొనే అవకాశం ఉంటుందని అతడి కోచ్ బిజూ జార్జ్ ‌అభిప్రాయపడ్డారు. ఏడు నెలల కాలంలో జరిగే రెండు ఐపీఎల్‌ సీజన్‌లలో తన శిష్యుడు శాంసన్‌ నిలకడగా రాణిస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శాంసన్ ప్రతిభ తెలిసిన వ్యక్తిగా.. టీంఇండియాలో అతడికి మరిన్ని అవకాశాలు దక్కాల్సిందన్నారు. ఎడమచేతి వాటం కావడంతోనే శాంసన్ కన్నా ఎక్కువగా రిషభ్ ‌పంత్‌కు అవకాశాలు వస్తున్నాయని బిజూ జార్జ్ పేర్కొన్నారు.

రెండు ఐపీఎల్‌లలో రాణిస్తే:

రెండు ఐపీఎల్‌లలో రాణిస్తే:

తాజాగా ఓ ఇంటర్వూలో సంజూ శాంసన్ కోచ్​ బిజూ జార్జ్ మాట్లాడుతూ... '2021 టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకొనేందుకు సంజూ శాంసన్‌కు ఇది సువర్ణావకాశం. తెలుపు బంతి క్రికెట్‌ కెరీర్‌ను పరిశీలిస్తే.. ఐపీఎల్‌లో అతడు నిలకడగా రాణిస్తున్నాడు. లీగ్‌లో ఆడేందుకు వెళ్లినప్పుడు అతడిపై ఒత్తిడి ఉంటుందనుకోను. ఈ ఏడాది శాంసన్‌ మరింత ప్రణాళికాబద్ధంగా సిద్ధమయ్యాడు. ఇప్పటిలా అంతగా దృష్టి సారించడం మునుపెన్నడూ చూడలేదు. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ త్రివేండ్రంలో చాలా కష్టపడ్డాడు' అని అన్నారు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 93 మ్యాచులు ఆడిన శాంసన్.. 27.61 సగటుతో 1696 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 102 నాటౌట్‌.

కుడి, ఎడమ వాటం గురించి పట్టించుకోవడం లేదు:

కుడి, ఎడమ వాటం గురించి పట్టించుకోవడం లేదు:

'ఐపీఎల్‌లో సంజూ శాంసన్‌ అద్భుతంగా ఆడతాడని టీమిండియా డ్రస్సింగ్ ‌రూమ్‌లోని క్రికెటర్లందరికీ తెలుసు. అతడిపై భారత సెలెక్టర్లకు ఓ అవగాహన ఉంటుంది. ఐపీఎల్ లీగ్‌లో శాంసన్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఆదుకున్నాడు. కేఎల్‌ రాహుల్‌, సంజూ శాంసన్‌తో పోలిస్తే.. రిషభ్‌ పంత్‌ది ఎడమచేతి వాటం. అందుకే అతడికి ఎక్కువ అవకాశాలు రావొచ్చు. అయితే ఇప్పుడు కుడి, ఎడమ వాటం గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. పరుగులు చేస్తున్నారా? లేదా? అనేదే చూస్తున్నారు' అని బిజూ జార్జ్ పేర్కొన్నారు.

సంజు వ్యవహారం ఓ హాట్ టాపిక్:

సంజు వ్యవహారం ఓ హాట్ టాపిక్:

ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో పరుగుల మోత మోగించే సంజు శాంసన్‌కు దురదృష్టవశాత్తు అంతర్జాతీయ క్రికెట్‌లో రావాల్సిన అవకాశాలు రాలేదు. టీమ్ సెలెక్షన్ జరిగిన ప్రతీసారి సంజు వ్యవహారం ఓ హాట్ టాపిక్.. ఇక రాక రాక వచ్చిన అవకాశాల్లో అతను నిరూపించుకోలేకపోయాడు. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినా.. ఇంకా భారత జట్టు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ తరఫు 12 మ్యాచ్‌లు ఆడిన శాంసన్.. ఓ సెంచరీతో 342 పరుగులు చేశాడు. ఇక ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌ పర్యటనలో రెండు టీ20 మ్యాచ్‌ల్లో అవకాశం దక్కించుకున్నా.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

మరో అవకాశం కోసం నాలుగేళ్లు:

మరో అవకాశం కోసం నాలుగేళ్లు:

2015 జింబాబ్వేతో జరిగిన టీ20 ద్వారా భారత జట్టులోకి వచ్చిన శాంసన్​.. మరో అవకాశం కోసం నాలుగేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. గతేడాది బంగ్లాదేశ్​తో టీ20 సిరీస్​కు ఎంపికైనా.. తుది జట్టులో చోటు దక్కలేదు. బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న శాంసన్.. వరుసగా 8, 2 పరుగులు చేశాడు.

Story first published: Saturday, August 1, 2020, 15:41 [IST]
Other articles published on Aug 1, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+