కేఎల్ రాహుల్‌పై కోచ్ కుంబ్లే సాఫ్ట్ కార్నర్ ఎందుకు?
విశాఖపట్నం: తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, ఇంగ్లాండ్‌తో విశాఖపట్నంలో జరగనున్న రెండో టెస్టులో అతడు ఆడాలని తాను కోరుకుంటున్నానని టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు.
మంగళవారం కుంబ్లే మీడియాతో మాట్లాడాడు. తుది జట్టులో ఉండాలన్న ఉద్దేశంతోనే అతనిని జట్టులోకి తీసుకున్నామని వ్యాఖ్యానించాడు. రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన ఓపెనర్ గౌతం గంభీర్ తొలి టెస్టులో విఫలమైన కారణంగానే రాహుల్‌ను పిలిపించారన్న వాదనను కుంబ్లే తొసిపుచ్చాడు.
రెండో టెస్టు ప్రారంభం కావడానికి మరో రెండు రోజుల సమయం ఉంది కాబట్టి, రంజీ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి, జట్టుకు అందుబాటులోకి వచ్చాడని చెప్పాడు. తొడ కండరాల గాయం కారణంగా న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు, వన్డే సిరీస్‌లకు రాహుల్ దూరమైన విషయాన్ని కుంబ్లే గుర్తుచేశాడు.
గాయం నుంచి పూర్తిగా కోలుకున్న రాహుల్ ప్రస్తుతం రాజస్థాన్‌లో జరుగుతున్న రంజీ ట్రోఫీలో కర్నాటక తరఫున ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 85 బంతుల్లో 76 పరగులు చేశాడు. ఇక మంగళవారం రెండో ఇన్నింగ్స్‌లో 132 బంతుల్లో సెంచరీ (106 పరుగులు) సాధించి ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌ను కూడా నిరూపించుకున్నాడు.

సెంచరీతో సెలక్టర్లను దృష్టిని ఆకర్షించిన రాహుల్
దీంతో సెలక్టర్లను దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లాండ్‌తో వైజాగ్‌లో గురువారం మొదలయ్యే రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని జట్టు ప్రకటించింది. మరోవైపు రెండో జట్టులోకి అందుబాటులోకి వచ్చిన ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌కు తుది జట్టులో చోటు లభిస్తుందా? అన్న ప్రశ్నపై స్పందిస్తూ, టీమిండియా ఏ ఒక్క వ్యక్తిపైనో దృష్టి కేంద్రీకరించడం లేదని స్పష్టం చేశాడు.

టెస్టుల్లో 463 వికెట్లు తీసిన ఆండర్సన్
ఆండర్సన్ టెస్టుల్లో 463 వికెట్లు తీశాడని, అతని అనుభవాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని కుంబ్లే అన్నాడు. అయితే క్రికెట్ అనేది ఒకరిద్దరిపై ఆధారపడి ఉండదని కుంబ్లే వ్యాఖ్యానించాడు. ఇక న్యూజిలాండ్ సిరీస్‌తోపాటు, ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్లు ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ అద్భుత ప్రతిభ కనబరిచారని ప్రశంసించాడు.

తొలి టెస్టులో భారత్ ఫీల్డింగ్‌లో వైఫల్యం
రివర్స్ స్వింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారని అన్నాడు. ఇక ఫీల్డింగ్‌లో భారత్ వైఫల్యాలను మీడియా ప్రస్తావించినప్పుడు కుంబ్లే కొంత ఇబ్బంది పడ్డాడు. ఫీల్డింగ్ విభాగాన్ని తీసుకుంటే, కేవలం క్యాచ్‌లు పట్టడంలోనే విఫలమయ్యామని తెలిపాడు.

ఆధిపత్యాన్ని కొనసాగించలేకపోయిన మాట వాస్తవమే
నిజానికి బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత జట్టు అద్భుత ప్రతిభను కనబరచిందని పేర్కొన్నాడు. అయితే, కొన్ని క్యాచ్‌లను వడలడం వల్ల ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని కొనసాగించలేకపోయామని చెప్పాడు. రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టులో భారత ఫీల్డర్లు ఆరు క్యాచ్‌లు విడిచిపెట్టడాన్ని కుంబ్లే తమ వైఫల్యంగానే అభివర్ణించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications