లైంగిక వేధింపుల ఆరోపణలపై రాహుల్ జోహ్రీని వివరణ కోరిన సీఓఏ

హైదరాబాద్: '#మీటూ' ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం సినిమా రంగానికి చెందిన వారు మాత్రమే కాకుండా మీడియా వంటి ఇతర రంగాలకు చెందిన మహిళలు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాలను.. అందుకు కారణమైన వ్యక్తుల పేర్లను ధైర్యంగా వెల్లడిస్తోన్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ '#మీటూ' ఉద్యమం ఇప్పుడు బీసీసీఐని తాకింది. బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్నాడు. బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ తనను లైంగిక వేధింపులకు గురి చేశాండంటూ ఓ మహిళా జర్నలిస్ట్ ఆరోపించింది. దీనికి సంబంధించిన వివరాలతో పాటు స్క్రీన్ షాట్లను జత చేస్తూ 'రాహుల్ జోహ్రి... నీ సమయం ముగిసింది' అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేసింది.

రాహుల్ జోహ్రీ ఆరోపణలపై సీఈఓ
ఈ ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ(సీఓఏ) స్పందించింది. రాహుల్ జోహ్రీ వివరణ ఇవ్వాలని క్రికెట్ పాలకుల కమిటీ (సీఓఏ) కోరింది. ఆయన వారం రోజులు గడువు అడిగారని, సమాధానం వచ్చాక తదుపరి చర్యలపై ఆలోచిస్తామని సీఓఏ పేర్కొంది. ఆయన 2001 నుంచి 2016 మధ్య డిస్కవరీ చానెల్‌లో పని చేస్తున్నప్పుడు తనను లైంగికంగా వేధించారంటూ మాజీ సహోద్యోగిని ఈ ఆరోపణలు చేసింది.

ఇంటికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు
రాహుల్ తన మాజీ సహుద్యోగని, ఓ రోజు తమ జాబ్‌కు సంబంధించిన విషయాలకు గురించి చర్చించడానికి వెళ్తే.. దానిని అతను అవకాశంగా తీసుకున్నాడని ఆరోపించింది. తనతో మంచిగా నటిస్తూ ఓ రోజు అతని భార్య, పిల్లలు లేని సమయంలో తనింటికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడని పేర్కొంది. అతని చర్యతో తనలో తను ఎంతో కుమిలిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

నన్ను తాకడానికి ప్రయత్నించేవారు
ఇక బాధితురాలు తెలిపిన మెయిళ్లలో ఉన్న వివరాల ప్రకారం "రాహుల్ జోహ్రీ ప్రస్తుతం బీసీసీఐ సీఈఓగా ఉన్నారు. రాహుల్ నా మాజీ సహోద్యోగి. విధుల్లో భాగంగా మేం బయటికి వెళ్లినప్పుడు ఆయన నన్ను తాకడానికి ప్రయత్నించేవారు. ఎక్కడున్నావ్? కాఫీకి వెళ్దామా అంటూ ఫోన్లు చేసేవాడు. ఒకసారి ఓ కొత్త న్యూస్ ఛానల్ ప్రారంభోత్సవానికి నన్ను రమ్మని పిలిచాడు. నేను అందుకు నిరాకరించాను" అని తెలిపింది.

ఆ మరుసటి రోజు ఉద్యోగం రీత్యా ఇబ్బందుల్లో పడ్డా
"ఆ మరుసటి రోజే నేను ఉద్యోగం రీత్యా ఇబ్బందుల్లో పడ్డాను. నాకు ఉద్యోగం చాలా అవసరం. అప్పటి నుంచి ఆయన పిలిచినప్పుడు ఎక్కడయికైనా వెళ్లాలంటే రానని చెప్పకుండా ఉండలేకపోయాను. కానీ, నేను నా హద్దుల్లో ఉండటం ఆయనకు నచ్చేది కాదు. నా పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు. ఓసారి నాతో వింతగా ప్రవర్తించేసరికి ఆయన మీద నేను గ్లాస్ విసిరేశాను. అయినా ఆయన ప్రవర్తన మారలేదు" అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
జోహ్రి 2016లో బీసీసీఐ సీఈఓగా నియమితుడయ్యాడు. బీసీసీఐలో చేరకముందు ఆయన డిస్కవరీ నెట్‌వర్క్స్ ఆసియా పసిఫిక్‌కు జనరల్ మేనేజర్, ఎక్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications