అంబుడ్స్‌మన్‌కు లక్ష్మణ్ లేఖ.. మా పాత్రేంటో సీవోఏ చెప్పలేదు

పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం భారత క్రికెట్ దిగ్గజాలు సౌరవ్ గుంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లను తాకింది. అయితే ఇప్పటికే సౌరవ్, సచిన్లు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు తమ వివరణను తెలిపారు. తాజాగా వీవీఎస్ లక్ష్మణ్ కూడా అంబుడ్స్‌మన్‌కు లేఖాస్త్రం సంధించాడు.
క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులుగా తమ పాత్ర ఏంటనేది బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఇప్పటి వరకు తమకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జాతీయ నియర్ కోచ్‌లను ఎంపిక చేసేందుకు మాత్రమే తమను నియమించినట్లు.. అంతకుమించి మా విధుల గురించి సీవోఏ ఎలాంటి నిబంధనలు విధించలేదని లక్ష్మణ్ లేఖలో పేర్కొన్నాడు.
క్రికెట్ సలహా కమిటీ సభ్యులుగా మా పాత్రపై స్పష్టత ఇవ్వాలని గత డిసెంబరులో సీఓఏకు లేఖ రాసినా.. ఇప్పటి వరకు స్పందన లేదు. మా పదవికాలం ఎంత్ననది ఎక్కడా పేర్కొనలేదు. భారత క్రికెట్‌ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మాత్రమే సీఏసీలో సభ్యునిగా చేరా, అంతేగానీ డబ్బుల కోసం కాదు. ఆటగాళ్లు, కోచ్‌లను ఎంపిక చేసే సెలెక్టర్లమని ఫిర్యాదు చేయడం నిరాధారమైనవి. ఇప్పటి వరకు భారత క్రికెట్ అభివృద్ధికి సంబంధించి మా నుంచి ఎలాంటి సలహాలు, సూచనలు తీసుకోలేదు. జాతీయ కోచ్‌ల ఎంపికలో కూడా అభిప్రాయాలు అడిగింది లేదు అని లక్ష్మణ్ తన లేఖలో రాశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications