హైదరాబాద్: సుప్రీం కోర్టు నియమించిన నలుగులు సభ్యుల కమిటీ (సీవోఏ) త్వరలో టీమిండియా మాజీ కెప్టెన్లు రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీలను ప్రశ్నించనుందా? అంటే అవునని తెలుస్తోంది.
నిబంధనలకు విరుద్ధంగా వీరిద్దరూ పరస్పర ప్రయోజనాలు పొందుతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో సీవోఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్ శ్రీనివాసన్ ఉన్నప్పుడు వీరిద్దరూ పరస్పర ప్రయోజనాలు పొందారనే వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ అంశంపై తెరపైకి రాడవంతో సీవోఏ ఈ విషయాలపై పునఃపరిశీలించాలనుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.
అదే క్రమంలో టీమిండియా అండర్ 19, ఇండియా ఏ జట్లకు కోచ్‌గా కూడా వ్యవహారిస్తున్నారు. మరోవైపు సౌరభ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడిగా, బీసీసీఐ టెక్నికల్ కమిటీ ఛైర్మన్‌గా, ఐఎస్ఎల్‌లో అథ్లెటికో డీ కోల్‌కతా జట్టుకు సహా యజమానిగా ఉన్నాడు.
ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ నిర్వహిస్తున్న రెండు రకాల బాధ్యతల గురించి ఇప్పటివరకు ఎవరూ ప్రశ్నించలేదు. అయితే గతంలో గంగూలీపై పలువురు విమర్శలు చేశారు. అయితే గంగూలీ
తన హోదాల్లో కొనసాగవచ్చని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు, ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహర్ గతంలో అంగీకరించాడు.