
సలహా కమిటీ హెడ్‌గా కపిల్ దేవ్
ఈ కమిటీలో మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, మాజీ మెన్స్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్, మహిళా జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామిలు సభ్యులుగా ఉన్నారు. టీమిండియా హెడ్ కోచ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఈ సలహా కమిటీ ఇంటర్వ్యూ చేయనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ స్పష్టం చేశారు.

వినోద్ రాయ్ మాట్లాడుతూ
ఆయన మాట్లాడుతూ "ఈ ముగ్గురూ మెన్స్ కోచ్‌ను ఎంపిక చేస్తారు. ఇది తాత్కాలిక కమిటీ కాదు. అయితే ప్రయోజనాలకు అనుగుణంగా ఇది నడుచుకుంటుంది. ఆగస్టు మధ్యలో ఇంటర్వ్యూలు జరుగుతాయని భావిస్తున్నాం" అని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ పేర్కొన్నారు. ప్రస్తుత హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి పదవి కాలాన్ని విండిస్ పర్యటన ముగిసే వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

ఆఖరి తేదీ జులై 30
ఈ నేపథ్యంలో హెడ్ కోచ్‌తో పాటు బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్, స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్‌లు, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి కలిగిన అభ్యర్దులు జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని బీసీసీఐ పేర్కొంది. మాజీ క్రికెటర్లు మహేళా జయవర్దనేతో పాటు గ్యారీ కిర్‌స్టన్, టామ్ మూడీ, మైక్ హెస్సన్‌లు హెడ్ కోచ్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

రవిశాస్త్రి దరఖాస్తు చేయకుండానే నేరుగా ఇంటర్వ్యూ
అయితే ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి దరఖాస్తు చేయకుండానే నేరుగా ఇంటర్వ్యూకు వచ్చే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. కాగా, ఫీల్డింగ్ కోచ్ స్థానం కోసం దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ దరఖాస్తు చేసుకున్నాడు. ఇదిలా ఉంటే, ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 3 వరకు భారత జట్టు వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 వన్డేలు, 3 టీ20లు, 2 టెస్టులు ఆడనుంది.


Click it and Unblock the Notifications












