Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కటక్ వేదికపై జరిగే టీమిండియా - దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ కోసం తొలి టికెట్ కొన్న సీఎం నవీన్ పట్నాయక్

CM Naveen Patnaik buys first ticket for India-South Africa second T20 match at Cuttack

జూన్ 12న ఒడిశా రాష్ట్రంలోని కటక్‌లోని బారాబతి స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ సెకండ్ టీ20 జరగనుంది. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ మ్యాచ్‌‌కు హాజరుకావడానికి తొలి టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. కటక్ స్టేడియంలో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడడం ఇది రెండోసారి. 2015లో కటక్ వేదికగా ఇరు జట్ల మ్యాచ్ జరగగా అప్పట్లో టీమిండియా ఓటమిపాలయింది. ఆతిథ్య జట్టు ఆరు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి.. సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం టీమిండియా దక్షిణాఫ్రికాతో పోల్చితే మెరుగైన జట్టుగా ఉంది. ఇటీవల టీమిండియా స్వదేశంలో అత్యద్భుతంగా ఆడుతూ.. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తోంది.

బిజినెస్ స్టాండర్డ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (OCA) అధ్యక్షుడు పంకజ్ లోచన్ మొహంతి, OCA కార్యదర్శి సంజయ్ బెహెరా సీఎంకు తొలి టికెట్‌ అందజేశారు. సోమవారం సాయంత్రమే వీరు తొలి టికెట్.. నవీన్ పట్నాయక్‌కు అందించి సాదర స్వాగతం పలికారు. ఇకపోతే కటక్ స్టేడియం వద్ద టిక్కెట్ల విక్రయం కోసం సజావుగా చేసిన ఏర్పాట్లను బెహరా సీఎంకు వివరించారు. దేశంలో కరోనా పరిస్థితి అదుపులోకి రావడంతో దక్షిణాఫ్రికా సిరీస్‌‌ కోసం బీసీసీఐ టీమిండియాకు బయోబబుల్ పరిమితులను తొలగించింది. ఇక ఇటీవలే ఐపీఎల్ 2022ను స్వదేశంలో బీసీసీఐ అత్యంత విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లకు కూడా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతించింది. ఇక దక్షిణాఫ్రికా సిరీస్ టైంలో కూడా స్టేడియాల్లోకి ప్రేక్షకులను బీససీసీ పూర్తి స్థాయిలో అనుమతించనుంది.

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్
మొదటి T20 మ్యాచ్- జూన్ 9న, ఢిల్లీ
2వ టీ20 మ్యాచ్ - జూన్ 12న, కటక్
3వ టీ20 మ్యాచ్ - జూన్ 14న, విశాఖపట్నం
4వ టీ20 మ్యాచ్ - జూన్ 17న, రాజ్‌కోట్
5వ టీ20 మ్యాచ్ - జూన్ 19న, బెంగళూరు
సౌతాఫ్రికా సిరీస్ కోసం టీమిండియా టీ20 జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్) (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, Y చాహల్, కుల్దీప్ యాదవ్ , అక్షర్ పటేల్, ఆర్ బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

Story first published: Tuesday, June 7, 2022, 18:49 [IST]
Other articles published on Jun 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+