Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CM Chandra Babu: నితీష్ కుమార్ రెడ్డికి సీఎం చంద్రబాబు అభినందనలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి సెంచరీతో అదరగొట్టాడు. ఎంతో ఎనుభవం ఉన్న ఆటగాడిగా జట్టును ముందు నడిపించాడు. ఓవర్ నైట్ స్కోర్ 164/5 తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ కాసేపటికే వికెట్ పంత్ వికెట్ కోల్పోయింది. అప్పుడు వచ్చిన నితీష్ కుమార్ నిలకడగా ఆడడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే 17 పరుగులు చేసిన రవింద్ర జడేజా నాథన్ లయన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు.

ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ తో నితీష్ రెడ్డి చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పుష్ప రాజ్ స్టైల్లో సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బాగా ఆడుతున్న వీరి జోడిని నాథన్ లయన్ విడగొట్టాడు. 50 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ క్రమంలోనే నితీష్ రెడ్డి సెంచరీకి దగ్గర అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బుమ్రా డకౌట్ అయ్యాడు.

CM Chandrababu congratulates Nitish Reddy for scoring a century in the Melbourne Test

దీంతో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేస్తాడా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. క్రీజ్ లోకి వచ్చిన సిరాజ్ డిఫెన్స్ ఆడాడు. ఆ తర్వాత ఓవర్ లో నితీష్ కుమార్ రెడ్డి ఫోర్ కొట్టి సెంచరీ చేశాడు. తన కేరీర్ లోనే మొదటి టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు నితీష్ కుమార్ కు అభినందనలు తెలియజేశారు. ఇలానే ముందుకెళ్లాలని సూచించారు.

"బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ట్రోఫీ 2024 లో ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ లో జరుగుతున్న క్రికెట్ నాలుగో టెస్టు మ్యాచ్ లో సెంచరీ సాధించిన విశాఖపట్నం యువకుడు కె.నితిష్ కుమార్ రెడ్డికి అభినందనలు. టెస్టు మ్యాచ్ లలో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతి పిన్న వయస్కుడు కూడా కావడం మరింత సంతోషం కలిగిస్తుంది. రంజీలో ఆంధ్రా తరపున ఎన్నో విజయాలు సాధించిన @NKReddy07, అండర్ 16లో కూడా అద్భుత విజయాలు అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని, భారత క్రికెట్ జట్టులో ఉండి దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

కాగా మూడో రోజు అట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. ప్రస్తుతం నితీష్ కుమార్ రెడ్డి 105, సిరాజ్ పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. నాలుగో రోజు ముందే ఆటను ప్రారంభించే అవకాశం ఉంది.

Story first published: Saturday, December 28, 2024, 14:54 [IST]
Other articles published on Dec 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+