న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెంచరీ ఆపాలని.. జట్టును ఓడించిన ఇంగ్లాండ్ బౌలర్

Club bowler sparks controversy throwing ball to boundary, denies batsman maiden century

హైదరాబాద్: వినడమే కాదు.. టీవీ లైవ్ ప్రసారాలలో స్లెడ్జింగ్‌లు చూస్తూనే ఉంటాం. జట్టు స్కోరు పెరగకుండా ఉండాలని ఇలా చేసే క్రికెటర్లుంటే, వ్యక్తిగతంగానూ బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేయాలనే బౌలర్లు ఉంటారు. ఇలానే బౌండరీకి వెళ్లినా పర్లేదు. కానీ ఆ బ్యాట్స్‌మన్ మాత్రం సెంచరీ చేయకూడదని తలంచాడు ఓ క్లబ్ క్రికెట్ బౌలర్. వివరాల్లోకి వెళితే..

బ్యాట్స్‌మెన్‌ స్కోరు 95.. జట్టు విజయానికి కావాల్సింది ఇంకా 5 పరుగులు. ఆ ఐదు పరుగులు ఆ బ్యాట్స్‌మెన్‌ చేస్తే జట్టు విజయంతో పాటు సెంచరీ చేయాలనే అతని కల కూడా నెరవేరుతోంది. కానీ, ఆ బౌలర్‌.. బ్యాట్స్‌మెన్‌ను సెంచరీ చేయనివ్వకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాడు. దీంతో జట్టైతే విజయం సాధించింది కానీ బ్యాట్స్‌మన్‌కి నిరాశ తప్పలేదు. ఇంగ్లాండ్‌లో. లీగ్‌లో భాగంగా పర్నెల్‌ క్రికెట్‌ క్లబ్‌-మైన్‌హెడ్‌ క్రికెట్‌ క్లబ్‌ మధ్య ఆగస్టు 4న మ్యాచ్‌ నిర్వహించారు.

ఈ మ్యాచ్‌లో మైన్‌హెడ్‌ ఆటగాడు డార్నెల్‌ 95 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు. అదే సమయంలో అతను ప్రాతినిధ్యం వహిస్తోన్న జట్టు విజయానికి ఐదు పరుగులు అవసరం. తర్వాతి బంతిని ఎదుర్కొనేందుకు డార్నెల్ సిద్ధంగా ఉన్నాడు. కానీ, పర్నెల్‌ జట్టు బౌలర్‌ డారెల్‌ను సెంచరీ పూర్తి చేయనివ్వలేదు. కావాలనే బంతిని నోబాల్‌గా వేసి అది బౌండరీకి పోయేటట్లు విసిరాడు. దీంతో మైన్‌హెడ్ జట్టు విజయం సాధించింది కానీ డారెల్‌ కలమాత్రం అలాగే మిగిలిపోయింది. ఇప్పటి వరకు డారెల్‌తన ఖాతాలో ఒక్క సెంచరీని కూడా నమోదు చేసుకోలేదు.

బ్యాట్స్‌మన్‌ మాత్రం తొలి సెంచరీ చేయకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న ఆ బౌలర్‌‌ను చూసి ఏమాత్రం చింతించకుండా నవ్వుతూ కనిపించాడు. దీంతో అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌పై డారెల్ ట్వీట్ చేస్తూ.. 'ఆట ముగించిన తీరు చూసి ప్రత్యర్థి జట్టు సిగ్గుపడాలి.' అంటూ సమాధానమిచ్చాడు.

Story first published: Tuesday, August 7, 2018, 13:20 [IST]
Other articles published on Aug 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X