For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్లైవ్‌ లాయిడ్‌కు బ్రిటిష్‌ అత్యుత్తమ పురస్కారం.. దిగ్గజాల సరసన చోటు!!

Clive Lloyd is to receive a knighthood for his outstanding service to cricket

లండన్‌: వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ క్లైవ్‌ లాయిడ్‌ బ్రిటిష్‌ అత్యుత్తమ పురస్కారం అందుకోనున్నారు. క్లైవ్‌ లాయిడ్‌కు 'నైట్‌హుడ్‌'ను ఇస్తున్నట్లు ఇటీవల విడుదల చేసిన 'న్యూ ఇయర్‌ ఆనర్స్‌ లిస్ట్‌'లో బ్రిటన్‌ ప్రభుత్వం పేర్కొంది. దీనితో 'సర్‌' బిరుదును సొంతం చేసుకున్న విండీస్‌ దిగ్గజాలు గారీ సోబర్స్‌, ఎవర్టన్‌ వీక్స్‌, వివియన్‌ రిచర్డ్స్‌ల సరసన క్లైవ్‌ లాయిడ్ నిలువబోతున్నారు.

'క్రికెట్‌కు అందించిన అత్యుత్తమ సేవలకు గాను నూతన సంవత్సరం సందర్భంగా క్లైవ్‌ లాయిడ్‌కు నైట్‌హుడ్‌ పురస్కారంను అందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు ఎంతో గౌరవం. నైట్‌హుడ్‌ను స్వీకరించనున్న వెస్టిండీస్‌ గ్రేట్‌ క్లైవ్‌ లాయిడ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు' అని విండీస్‌ క్రికెట్‌ బోర్డ్‌ ట్వీట్‌ చేసింది.

క్లైవ్‌ హ్యుబర్ట్‌ లాయిడ్‌ 1944లో గయానాలో జన్మించారు. 22 సంవత్సరాల వయసులో భారత్‌తో జరిగిన టెస్ట్‌ క్రికెట్‌తో లాయిడ్‌ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి 110 టెస్ట్‌ మాచ్‌లలో 7515 పరుగులతో, 46కి పైగా సగటుతో పరుగులు సాధించారు. ఈ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ 1975, 1979లలో ప్రపంచ కప్‌ను గెలిచిన వెస్టిండీస్‌ జట్టుకు సారధ్యం వహించారు. విండీస్‌ సారథిగా జట్టుకు 11 అంతర్జాతీయ మ్యాచుల్లో వరుస విజయాలు సాధించారు.

క్లైవ్‌ హ్యుబర్ట్‌ లాయిడ్‌ 110 టెస్ట్‌ మాచ్‌లలో 7515 పరుగులు చేశారు. అత్యధిక స్కోర్ 242 నాటౌట్. 19 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు లాయిడ్‌ ఖాతాలో ఉన్నాయి. 87 వన్డే మాచ్‌లలో 1977 పరుగులు సాధించారు. ఇందులో ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 102. లాయిడ్‌ వన్డే ఆటగాడి కంటే టెస్ట్‌ ఆటగాడిగానే గుర్తింపు సాధించారు. 1985లో చివరి మ్యాచ్ ఆడారు.

Story first published: Sunday, December 29, 2019, 13:04 [IST]
Other articles published on Dec 29, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+