న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పురుషుల క్రికెట్‌లో మహిళా అంపైర్‌!!

Claire Polosak to become first female umpire in men’s ODI

పురుషుల క్రికెట్‌లో మహిళా అంపైర్‌ విధులు నిర్వహించారు. దీంతో తొలిసారి ఓ మహిళ అంపైర్‌ పురుషుల క్రికెట్‌లో అంపైర్‌గా వ్యవహరించి సరికొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్‌ క్రికెట్‌ లీగ్‌ డివిజన్‌-2లో భాగంగా ఒమన్‌, నమీబియా మధ్య శనివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన క్లెయిరే పొలొసాక్‌ అంపైర్‌గా విధులు నిర్వహించారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

క్లెయిరే పొలొసాక్‌ 2016 నవంబర్ నెలలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ ద్వారా అంపైరింగ్ కెరీర్ ప్రారంభించింది. 2018 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్.. 2017 మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో నాలుగు మ్యాచ్‌లకు అంపైర్‌గా పనిచేసింది. మొత్తంగా క్లెయిరే 15 వన్డే మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేసింది. అయితే క్లెయిరే గతంలో ఎప్పుడూ క్రికెట్‌ ఆడకపోవడం విశేషం.

క్లెయిరే మాట్లాడుతూ... 'పురుషుల అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో అంపైర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉంది. మహిళా అంపైర్లకి మరిన్ని అవకాశాలిచ్చి ప్రోత్సహించాలి. మహిళలకు అంపైరింగ్ పై అవగాహన కల్పించి ముందుకు తీసుకెళ్లాలి. భవిష్యత్తులో మరికొందరు మహిళలు అంపైర్‌గా రాణిస్తారని' క్లెయిరే ఆశాభావం వ్యక్తం చేసింది.

Story first published: Sunday, April 28, 2019, 12:50 [IST]
Other articles published on Apr 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X