Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రూ.5 కోట్లు విరాళం ఇవ్వండి: సీఓఏకు బీసీసీఐ అధ్యక్షుడు ఖన్నా లేఖ

BCCI Should Donate Rs 5 Crore For Pulwama Tragedy Families Says C.K. Khanna To COA | Oneindia Telugu
CK Khanna to COA: BCCI should donate Rs 5 crore for Pulwama martyrs families

హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు యావత్ దేశం బాసటగా నిలుస్తోంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులతో సహా పలువురు ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తాజాగా భారత్‌ క్రికెట్ ‌నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా తనవంతు సాయంగా దాదాపు రూ.5 కోట్లు విరాళం ఇవ్వాలని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌కు లేఖ రాశారు.

పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తున్నాం

పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తున్నాం

"పుల్వామా ఉగ్రదాడి ఘటనను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అమర జవాన్ల కుటుంబాలకు పూర్తి సానుభూతి ప్రకటిస్తున్నా. ఇతర భారతీయులలాగే మేం కూడా చాలా బాధపడుతున్నాం. సీవోఏకు నా విన్నపం ఒక్కటే. ఆ కుటుంబాలకు కనీసం రూ. 5 కోట్లు ఇవ్వాలని సీఓఏకు విజ్ఞప్తి చేస్తున్నాను" అని ఆయన లేఖ రాశారు.

తొలి టి20కి ముందు రెండు నిమిషాల మౌనం

తొలి టి20కి ముందు రెండు నిమిషాల మౌనం

అదే విధంగా రాష్ట్రాల అసోసియేషన్స్‌తో పాటు, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ యజమానులు కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. పుల్వామా ఘటనకు సంతాపం ప్రకటిస్తూ ఫిబ్రవరి 24న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి టి20కి ముందు రెండు నిమిషాల మౌనం పాటించాలని ఆయన కోరారు.

ముందుకొచ్చిన సెహ్వాగ్

ముందుకొచ్చిన సెహ్వాగ్

ఇక, అమర జవాన్ల పిల్లలు ‘సెహ్వాగ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌'కు దరఖాస్తు చేసుకుంటే ఉచిత విద్యను అందించనున్నట్లు టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరానీ కప్‌ విజేతగా నిలిచిన విదర్భ జట్టు తాము అందుకున్న ప్రైజీ మనీని మొత్తాన్ని జవాన్ల కుటుంబాలకు అందించనున్నట్లు వెల్లడించింది.

విజేందర్‌ సింగ్‌ ఒక నెల జీతాన్ని

విజేందర్‌ సింగ్‌ ఒక నెల జీతాన్ని

మరోవైపు హర్యనా పోలీస్‌ శాఖలో ఉన్నత ఉద్యోగి అయిన స్టార్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ తన ఒక నెల జీతాన్ని అమరుల కుటుంబాలకు అందజేస్తున్నట్లు ప్రకటించాడు. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతిచెందగా... తీవ్రంగా గాయాలపాలైన పలువురు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

Story first published: Wednesday, February 20, 2019, 10:20 [IST]
Other articles published on Feb 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+