న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నాథన్ లియానే ఉదాహరణ, వరల్డ్‌కప్‌లో అశ్విన్‌ను ఆడించాలి'

Ashwin Must Be Considered For 2019 World Cup Says Gautam Gambhir | Oneindia Telugu
Citing Nathan Lyons example, Gautam Gambhir bats for R Ashwin selection for 2019 World Cup

హైదరాబాద్: ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌కు టీమిండియా సీనియర్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. ఈ విషయంలో ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్‌ను ఉదాహరణగా తీసుకోవాలని గంభీర్ సూచించాడు.

1st ODI: విలియమ్సన్ హాఫ్ సెంచరీ, చాహల్ దెబ్బకు కివీస్ కుదేలు1st ODI: విలియమ్సన్ హాఫ్ సెంచరీ, చాహల్ దెబ్బకు కివీస్ కుదేలు

ప్రస్తుతం భారత్ తరుపున చైనామన్ స్పిన్నర్లు బాగా ఆడుతున్నప్పటికీ రవిచంద్రన్ అశ్విన్‌ అనుభవం ఇంగ్లాండ్‌లో జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని గంభీర్ అన్నాడు. ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ "గతేడాది చైనామన్ స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. ఇప్పటికీ అశ్విన్‌ను పరిగణనలోకి తీసుకోవాలి" అని గంభీర్ అన్నాడు.

"మణికట్టు స్పిన్నరా ఫింగర్‌ స్పిన్నరా అని కాకుండా నాణ్యమైన స్పిన్నర్‌ ఎవరన్నది కీలకం. టెస్టు క్రికెట్‌లో రాణించిన నాథన్ లియాన్‌ను ఆస్ట్రేలియా వన్డేలకు ఎంపిక చేసింది. ఇంగ్లాండ్‌లో అశ్విన్‌కు అనుభవం ఉంది. అక్కడి ఫ్లాట్‌ పిచ్‌లకు అతడు సరిపోతాడు" అని గంభీర్ పేర్కొన్నాడు.

"టెస్టు క్రికెట్‌కు దూరమైన ఆటగాళ్లు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడితే బాగుంటుంది. అంబటి రాయుడు, ధోనీ, శిఖర్‌ ధావన్‌ రంజీలు ఆడితే మంచిది" అని గంభీర్ అన్నాడు. చైనామన్ స్పిన్నర్లు యుజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌ జోడీ వన్డేల్లో అద్భుత ప్రదర్శన చేస్తుండటంతో 2017 జులై నుంచి అశ్విన్ వన్డే జట్టుకు దూరమయ్యాడు.

Story first published: Wednesday, January 23, 2019, 11:07 [IST]
Other articles published on Jan 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X