Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shubman Gill: క్రికెటర్ శుభ్ మన్ గిల్ తోపాటు ముగ్గురికి సీఐడీ నోటీసులు..

భారత క్రికెటర్ శుభ్ మన్ గిల్ కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. గిల్ తో పాటు రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, సాయి సుదర్శన్ కూడా నోటీసులు వచ్చాయి. రూ.450 కోట్ల చిట్-ఫండ్ పోంజీ స్కామ్‌కు సంబంధించి వీరికి నోటీసులు ఇచ్చింది సీఐడీ. బీజెడ్‌ గ్రూప్‌ బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి రూ.6 వేల కోట్లను సేకరించి మోసం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బీజెడ్‌ గ్రూప్‌ సీఈవో భూపేంద్ర సింగ్ ఝలాను గుజరాత్ సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

బీజెడ్‌ గ్రూప్‌ లో గుజరాత్ ఆటగాళ్లైన వీరు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే శుభ్ మన్ గిల్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, సాయి సుదర్శన్ కూడా నోటీసులు ఇచ్చారు. అహ్మదాబాద్ మిర్రర్ నివేదిక ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహిస్తున్న శుభమాన్ గిల్ ఈ కంపెనీలో రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టాడు. మిగతా వారు అతని కంటే తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం సీఐడీ పోలీసులు భూపేంద్ర, సింగ్ ఝలా, రుషిక్ మెహతా బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు.

CID issues notices to cricketers Shubha Man Gill Rahul Telatia Sai Sudarshan and Mohit Sharma

భూపేంద్ర సింగ్ ఝలా బ్యాంకు కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని చాలా మంది వద్ద డబ్బులు సేకరించారు. కొద్ది నెలల తర్వాత కంపెనీపై అనుమానం రావడంతో పలువురు సీఐడీకి ఫిర్యదు చేశారు. సీఐడీ కేసు నమోదు చేసి విచారణ చేయగా.. రూ.450 కోట్ల కుంభకోణం బయటపడింది. ఈ కేసులో ఇప్పటి వరకు 10 మంది అరెస్ట్ అయ్యారు. కాగా శుభ్ మన్ గిల్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. మిగతా క్రికెటర్లు ఇండియాలోనే ఉన్నట్లు తెలిసింది.

దీనిపై వారు ఇప్పటి వరకు స్పందించలేదు. వీరు వారి లాయర్లతో సంప్రదించి స్పందించే అవకాశం ఉంది. ప్రస్తుతం కేసు విచారణ దశ ఉందని ఓ అధికారి తెలిపారు.

Story first published: Thursday, January 2, 2025, 14:35 [IST]
Other articles published on Jan 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+