Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐపై తేల్చిసిన కేంద్రం

కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) సోమవారం కీలక తీర్పును వెలువరించింది. బీసీసీఐ సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాబోదని తేల్చి చెప్పింది. ఆర్టీఐ యాక్ట్ పరిధిలోకి వచ్చే ప్రజాధికార సంస్థగా దీన్ని వర్గీకరించలేమని స్పష్టం చేసింది. బీసీసీఐ యాజమాన్యంపై ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణా లేదని, ఇది ప్రభుత్వ సంస్థ కాదని తేల్చి చెప్పింది. అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి ఆర్థిక సాయం బోర్డుకు అందట్లేదని పేర్కొంది.

జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లల్లో భారత్ కు బీసీసీఐ ఎలా ప్రాతినిధ్యం వహిస్తుంది, ఆటగాళ్లను ఎలా ఎంపిక చేస్తుందనే విషయాలపై సమాచారం కోరుతూ దాఖలైన అప్పీల్‌ను కేంద్ర సమాచార కమిషన్ కొట్టివేసింది. ఆర్టీఐ యాక్ట్ కింద ఆ సమాచారాన్ని ఇవ్వలేమని తెలిపింది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి బీసీసీఐ వస్తుందా, రాదా అనే విషయంపై నెలకొన్న గందరగోళానికి ఈ తీర్పుతో తెరపడినట్లయింది.

CIC Rules that BCCI Not Owned or Financed by Government Excludes RTI Status Not Government-Run Body

సమాచార కమిషనర్ పీఆర్ రమేష్ దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదైన ప్రైవేట్ స్వయంప్రతిపత్త గల సంస్థగా వివరించారు. ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్ 2 (హెచ్) పరిధిలోకి వచ్చే 'ప్రజాధికార సంస్థ'గా బీసీసీఐని కేటగిరీ చేయలేమని, ప్రస్తుత పరిస్థితులలో.. ఈ చట్టంలోని నిబంధనలు ఏవీ కూడా దీనికి వర్తించబోవని స్పష్టం చేశారు. గతంలో సమాచార కమిషనర్ ఎం శ్రీధర్ ఆచార్యులు బీసీసీఐని ఆర్‌టీఐ చట్టం కింద 'ప్రజాధికార సంస్థ'గా ప్రకటించిన విషయం తెలిసిందే. తమ పరిధిలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లను నియమించుకోవాలని కూడా ఆయన అప్పట్లో ఆదేశించారు.

శ్రీధర్ ఆచార్యులు ఇచ్చిన ఆదేశాలను బీసీసీఐ మద్రాస్ హైకోర్టులో సవాలు చేసింది. దేశంలోని సుప్రీంకోర్టు పాత తీర్పులను పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసును తాజాగా విచారించాల్సిందిగా సీఐసీకి తిరిగి పంపింది. తద్వారా ఈ వివాదం మళ్ళీ సీఐసీ వద్దకు చేరింది. ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్ 2 (హెచ్) కింద నిర్దేశించిన చట్టబద్ధమైన నిబంధనలు బీసీసీఐకి వర్తించబోవని కమిషన్ తాజాగా పేర్కొంది. రాజ్యాంగం ద్వారా గానీ, పార్లమెంట్/శాసనసభ ద్వారా రూపొందించిన ఏ చట్టం ద్వారా గానీ ఈ బోర్డు ఏర్పాటు కాలేదని స్పష్టం చేసింది.

బీసీసీఐ ఆర్థికంగా పూర్తి స్వయంప్రతిపత్తితో పనిచేస్తున్న సంస్థగా అభివర్ణించింది. తమ ఆదాయాన్ని మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు, బ్రాడ్‌కాస్టింగ్ డీల్స్, టికెట్ అమ్మకాల వంటి మార్గాల ద్వారా బీసీసీఐ స్వయంగా సమకూర్చుకుంటుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా చట్ట ప్రకారం లభించే పన్ను మినహాయింపులు లేదా ఇతర చట్టబద్ధమైన రాయితీలను ఆర్‌టీఐ యాక్ట్ పరిధిలో ప్రభుత్వ నుంచి అందుతున్న ఆర్థిక సహాయంగా పరిగణించలేమని తేల్చేసింది.

Story first published: Monday, May 18, 2026, 15:51 [IST]
Other articles published on May 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+