వరల్డ్ కప్ ప్రారంభ వేడుకలు... ఎప్పుడు, ఎక్కడ, ఎవరెవరు?
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడూ అని యావత్ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ సంబరాలు గురించి వివరాలు తెలిశాయి. ఆస్టేలియాలోని మెల్ బోర్న్, న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ వేదికలుగా వన్డ్ క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభం వేడుకలు మొదలవడంతో టోర్నమెంట్ ప్రారంభకానుంది.
ఫిబ్రవరి 12(గురువారం) సాయంత్రం 6.30 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల వరకు వేడుకలు జరగున్నాయని ఐసీసీ అధికారకంగా ప్రకటించింది. ఈ ప్రారంభ వేడుకల్లో అబ్బురపరచే బాణసంచా వెలుగలకు తోడుగా, ఆస్టేలియా, న్యూజిలాండ్ కళాకారుల సంగీత, సాంస్కృతిక ప్రదర్శనలతో కనువిందు చేస్తారని ఐసీసీ వెల్లడించింది.

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ వేదికలో జరిగే ప్రారంభ వేడుకలకు మాజీ క్రికెటర్లు రిచర్డ్ హాడ్లీ, స్టీఫెన్ ప్లెమింగ్‌తో పాటు న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ మెక్ కల్లమ్ తదితరులు హాజరవనున్నారు. ఈ ప్రారంభ వేడుకలను ప్రేక్షకులు ఉచితంగా వీక్షించవచ్చు. న్యూజిలాండ్‌కు చెందిన కళాకారులు సోలో3 మియో, గిన్నీ బ్లాక్ మోర్, హెయిలీ వెస్టిన్రా లాంటి వారు తమ తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించున్నారు.
ఇక మెల్ బోర్న్‌లో జరగనున్న ప్రారంభ వేడుకల్లో ఇప్పటి వరకు ప్రపంచ కప్‌లో ఆడిన మాజీ దిగ్గజ ఆటగాళ్లు పాలుపంచుకోనున్నారు. క్రికెట్ ఆస్టేలియా ఈ ప్రారంభ వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అద్భుతమైన మ్యూజిక్ ప్రదర్శనలు, బాణసంచా వెలుగులతో ఓ 'స్పెషల్ మూమెంట్'తో ప్రేక్షకులకు ఆశ్చర్యపరచనున్నారు.
ఫిబ్రవరి 14న ప్రారంభం కానున్న ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో మొత్తం 14 జట్లు పాల్గొనున్నాయి. టోర్నమెంట్ మొత్తం 49 రోజుల పాటు జరగనుంది. మార్చి 29న జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ గ్రౌండ్ కెపాసిటీ లక్ష మంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications