Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొడ కండరాలు పట్టివేత: నాలుగో టెస్టుకు వోక్స్ దూరమే!

 Chris Woakes doubtful for Englands fourth Test against India

సౌతాంప్టన్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్‌తో జరగనున్న నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్‌ వోక్స్‌ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి సౌతాంప్టన్ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాయి.

మంగళవారం ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల ప్రాక్టీస్‌ సెషన్‌లో వోక్స్‌ కనిపించలేదు. కుడి కాలి తొడ కండరాలు పట్టేయడంతో క్రిస్ వోక్స్‌ ప్రాక్టీస్‌కు హాజరుకాలేదని ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. గతంలో కూడా ఇదే సమస్యతో క్రిస్ వోక్స్‌ ఇంగ్లాండ్‌ జట్టులో చోటు కోల్పోయాడు. తాజాగా అతని గాయం మళ్లీ తిరగబెట్టినట్లు తెలుస్తోంది.

దీంతో ఇరు జట్ల మధ్య గురువారం నుంచి ఆరంభమయ్యే నాలుగో టెస్టుకు క్రిస్ వోక్స్ దూరం కానున్నాడు. లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెన్‌ స్టోక్స్‌ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన వోక్స్‌ 137 పరుగులతో నాలుగు వికెట్లు తీసి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా అందుకున్నాడు.

గాయం కారణంగా వోక్స్ వోక్స్‌ దూరమైతే ఆ స్థానంలో యువ ఆటగాడు శామ్ కుర్రన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కోహ్లీసేన 1-2తేడాతో వెనుకంజలో ఉంది. దీంతో నాలుగో టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని కోహ్లీసేన చూస్తుండగా, ఈ టెస్టులో గెలిచి మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్‌ ఉవ్విళ్లూరుతోంది.

Story first published: Wednesday, August 29, 2018, 15:26 [IST]
Other articles published on Aug 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+