ఆస్ట్రేలియా హై పెర్మామెన్స్ కోచ్‌గా క్రిస్ రోజర్స్

Posted By:
Chris Rogers Appointed Australia High-performance Coach

హైదరాబాద్: క్రికెట్ ఆస్ట్రేలియా హై ఫెర్ఫార్మెన్స్ కోచ్‌గా మాజీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ క్రిస్ రోజర్స్ నియమితులయ్యారు. భావి క్రికెట్ స్టార్లను వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యతను ఆయన భుజానికి ఎత్తుకోనున్నారు. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో దూసుకుపోతోన్న ఆస్ట్రేలియా జట్టును ఆయన మరింత మెరుగ్గా రాణిస్తారనే నమ్మకంతో ఈ పదవికి తీసుకున్నట్లు సమాచారం.

40 ఏళ్ల రోజర్స్ 25 టెస్టులు ఆడారు. చివరగా 2015లో యాషెస్ సిరీస్‌లో బరిలో దిగారు. ఇప్పటికే ఆయన కోచ్‌గా వివిధ స్థాయుల్లో బాధ్యతలు నిర్వహించారు. ఆస్ట్రేలియా యువ క్రికెటర్లను అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లుగా తీర్చిదిద్దడంలో క్రిస్ తనదైన పనితీరు కనబరుస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఆశాభావం వ్యక్తం చేసింది.

రోజర్స్ దాదాపు ఇరవై ఏళ్లపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తరఫున 300 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. బౌలింగ్ విభాగం కోసం హై ఫెర్ఫార్మెన్స్ కోచ్‌గా ఎంపికైన ర్యాన్ హ్యారిస్‌తో ఆయన కలిసి పని చేయనున్నారు.

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రతినిధి మాట్లాడుతూ.. 'క్రిస్ జట్టును ఒక కొత్త తరహాలో నడిపిస్తారని ఆశిస్తున్నాం. రాబోయే జనరేషన్‌కు ఆయన ఆదర్శంగా నిలుస్తారు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆయన నేతృత్వంలో మంచి భవిష్యత్ ఉంటుంది' అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Story first published: Wednesday, March 14, 2018, 17:27 [IST]
Other articles published on Mar 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి