అన్రిచ్ స్థానంలో మోరిస్: సఫారీల వరల్డ్‌కప్ జట్టులో చిన్న మార్పు

హైదరాబాద్: గాయపడిన దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే స్థానంలో అల్ రౌండర్ క్రిస్ మోరిస్‌ని జట్టులోకి తీసుకుంటున్నట్లు క్రికెట్ దక్షిణాఫ్రికా ఓ ప్రకటనలో పేర్కొంది. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ గాయం కారణంగా వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. పోర్ట్ ఎలిజబెత్ స్టేడియంలో నిర్వహించిన నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో అతని కుడి చేతి బొటన వేలు విరిగింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్‌ని జట్టులోకి తీసుకుంటున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది.
ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా జట్టు మేనేజర్ మహ్మద్ మూసాజీ మాట్లాడుతూ "సోమవారం పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో అన్రిచ్ కుడి చేతి బొటన వేలికి ఫ్రాక్చర్ అయింది. వెంటనే అతనికి వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. అతనికి కనీసం ఎనిమిది వారాలు విశ్రాంతి ఇవ్వాలని సూచించడంతో అతన్ని జట్టు నుంచి తప్పించాం. అతను త్వరగా కోలుకోవాలి" అని అన్నాడు.
దీనిపై దక్షిణాఫ్రికా సెలక్షన్ ప్యానెల్ కన్వీనర్ లిండా జోండీ మాట్లాడుతూ "క్రిస్ మోరిస్ మా ప్రణాళికలో ఉన్నాడు. అతను బ్యాట్‌తో, బాల్‌తో రెండు విధాలుగా రాణించగలడు. యూకేలో అతనికి మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్ల వేయడంతో అతనికి మంచి ప్రావీణ్యం ఉంది. బ్యాటింగ్‌తో కూడా మ్యాచ్‌ని గెలిపించగలడు" అని చెప్పుకొచ్చాడు.
మరోవైపు గాయం కారణంగా వరల్డ్‌కప్‌కు దూరమైన అన్రిచ్ నోర్ట్జేపై మాట్లాడుతూ "అన్రిచ్ విషయంలో జరిగిన దానికి చింతిస్తున్నాం. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. వరల్డ్‌కప్‌కి ముందు ఆటగాళ్లు గాయపడటం ఎంతో బాధకరమైన విషయం" అని వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications