Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గిటార్ చేతపట్టిన సచిన్: క్రికెట్ ఆడిన పాప్ స్టార్‌

ముంబై: బ్రిటన్ పాప్ స్టార్ క్రిస్ మార్టిన్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ముంబై వీధుల్లో క్రికెట్ ఆడారు. తొలిసారి భార‌త్‌లో ప్రదర్శన చేయ‌డానికి వ‌చ్చిన క్రిస్ మార్టిన్.... స‌చిన్‌తో క‌లిసి ముంబైలోని శ్రీగాడ్జే మహారాజ స్కూల్‌కు వెళ్లాడు. అక్క‌డి విద్యార్థులు, టీచ‌ర్ల‌తో కాసేపు ముచ్చ‌టించిన వీరిద్దరూ అక్క‌డే కాసేపు క్రికెట్ ఆడారు.

మంచి భవిష్యత్ కోసం ఎలా కష్టపడాలో వివరించారు. మార్టిన్ బౌలింగ్ చేయ‌గా.. స‌చిన్ బ్యాటింగ్ చేశాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ విద్యార్థులలో సహజంగా నెలకొన్న భయాలను పారద్రోలే ప్రయత్నం చేశారు. ఎప్పుడూ బ్యాట్ తో అలరించే సచిన్ గిటార్‌ వాయించి విద్యార్థులను అలరించారు.

Chris Martin, Sachin Tendulkar visit Mumbai school and play cricket with students

అనంతరం క్రిస్ మార్టిన్‌ చేతిలో సచిన్ బ్యాట్ పెట్టాడు. దీంతో పిల్లల కోసం వీరిద్దరూ కాసేపు క్రికెట్ ఆడి అలరించారు. క్రిస్ మార్టిన్‌ సచిన్‌కు గిటార్ వాయించడంలో కొన్ని మెళకువలు నేర్పాడు. దీంతో సచిన్ గిటార్ వాయించాడు. దీనికి సంబంధించిన వీడియోను మ‌ధుకేశ్వ‌ర్ దేశాయ్ అనే వ్య‌క్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

కాగా, క్రిస్ మార్టిన్‌ గ్లోబల్‌ సిటిజన్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా 2016 కోసం ముంబైలో శనివారం ప్రదర్శన ఇచ్చాడు. అత‌నితోపాటు అత‌ని టీమ్ జానీ బ‌క్‌లాండ్‌, గ‌య్ బెర్రీమాన్‌, విల్ చాంపియ‌న్ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌కు బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బ‌చ్చ‌న్‌, షారుక్‌, రెహ‌మాన్‌తోపాటు మ‌రికొంద‌రు ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+