Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'కోల్డ్ ప్లే'క‌న్స‌ర్ట్‌లో బుమ్రా హంగామా.. 1,34,000 మందితో హోరెత్తిన స్టేడియం

అహ్మ‌దాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం తాజాగా టీమిండియా స్టార్ బౌల‌ర్‌ జ‌స్ప్రిత్ బుమ్రా పేరుతో మార్మోగిపోయింది. తాజాగా ఈ మైదానం వేదికగా గ్రాండ్ గా జ‌రిగిన 'కోల్డ్ ప్లే' క‌న్స‌ర్ట్‌కు బుమ్రా హాజరై సంద‌డి చేశాడు. అయితే ఈ స్పెషల్ ఈవెంట్‌లో అతడే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. ఈ సంద‌ర్భంగా బుమ్రాపై సింగ‌ర్ క్రిస్ మార్టిన్ ఓ స్పెష‌ల్ సాంగ్ కూడా పాడి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాడు.

"జ‌స్ప్రిత్‌.. మై బ్యూటీఫుల్ బ్ర‌ద‌ర్‌. ది బెస్ట్ బౌల‌ర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ క్రికెట్‌. వుయ్ డు నాట్ ఎంజాయ్ యు డెస్ట్రాయింగ్ ఇంగ్లాండ్ విత్ వికెట్స్ ఆఫ్ట‌ర్ వికెట్స్" అంటూ పాట పాడాడు క్రిస్ మార్టిన్. ఈ సాంగ్ ను అక్కడికి వచ్చిన ప్రేక్షకులతో పాటు బుమ్రా ఎంచక్కా ఆస్వాదించారు. ఈ క్రమంలోనే స్టేడియం మొత్తం బుమ్రా నామస్మరణతో మార్మోగేలా చేశారు ఆడియెన్స్.

IND VS ENG Chris Martin Honors Jasprit Bumrah with Special Song at Coldplay s Ahmedabad Narendra Modi Stadium Concert

ఈ ఈవెంట్ కు బ్లాక్ కలర్ షర్ట్ ధరించి వచ్చిన బుమ్రా.. ప్రేక్షకుల మధ్యలో నిలబడి కన్సర్ట్ ను ఆస్వాదిస్తూ ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇక ఈ క‌న్స‌ర్ట్‌లో ఇంగ్లాండ్ పై టెస్టు సిరీస్‌లో బుమ్రా చేసిన అద్భుత ప్ర‌ద‌ర్శ‌నకు సంబంధించిన వీడియోను కూడా ప్ర‌ద‌ర్శించారు. అప్పుడు కూడా ఒక్క‌సారిగా ప్రేక్ష‌కుల కేరింతలు, అరుపుల‌తో స్టేడియం దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కోల్డ్ ప్లే' క‌న్స‌ర్ట్‌లో బుమ్రా సంద‌డి చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, 21 శతాబ్దంలో ఆసియాలో అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన మ్యాజిక్ కన్సర్ట్ గా ఈ నరేంద్ర మోదీ స్టేడియం కోల్డ్ ప్లే కన్సర్ట్ నిలిచింది. దాదాపు 1,34,000 వేల మంది ఈ కన్సర్ట్ కు హాజరయ్యారని తెలిసింది.

అంతకుముందు కూడా ఇలానే
'కోల్డ్ ప్లే' క‌న్స‌ర్ట్‌లో బుమ్రాకు సంబంధించిన వీడియో ప్రదర్శించడం ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన కన్సర్ట్‌లోనూ బుమ్రా బౌలింగ్‌ క్లిప్‌ను ప్రదర్శించారు. 2024లో ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ను యార్కర్‌తో బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేసిన వీడియోను ప్రదర్శన చేశారు.

Story first published: Monday, January 27, 2025, 9:11 [IST]
Other articles published on Jan 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+