For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పీఎస్‌ఎల్‌లో సెంచరీతో చెలరేగిన క్రిస్‌లిన్‌.. కానీ కరోనా కారణంగా!!

Chris Lynn to return early from PSL due to coronavirus pandemic

లాహోర్‌: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ (113, 55 బంతుల్లో 12x4, 8x6) అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఆదివారం లాహోర్‌ కలందర్స్‌, ముల్తాన్‌ సుల్తాన్‌ జట్ల మధ్య జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో లిన్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. లిన్‌ పరుగుల వరద పారించడంతో కలందర్స్‌ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో లాహోర్‌ కలందర్స్‌ సెమీస్‌ చేరుకుంది.

 సెంచరీతో చెలరేగిన క్రిస్‌లిన్‌:

సెంచరీతో చెలరేగిన క్రిస్‌లిన్‌:

తొలుత బ్యాటింగ్‌ చేసిన ముల్తాన్‌ సుల్తాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఖుష్దిల్ షా (70) హాఫ్ సెంచరీ చేయగా.. షాన్ మసూద్ (40) రాణించాడు. లక్ష్య ఛేదనలో క్రిస్‌ లిన్‌ శతకంతో చెలరేగడంతో లాహోర్‌ కేవలం ఒక వికెట్‌ కోల్పోయి 18.5 ఓవర్లలో 191 పరుగులు చేసింది. లిన్‌కు తోడు పాక్‌ బ్యాట్స్‌మన్‌ ఫకర్‌ జమాన్‌ (57) హాఫ్ సెంచరీ చేసాడు. పీఎస్‌ఎల్‌లో లాహోర్‌ కలందర్స్‌ సెమీస్‌ చేరడం ఇదే తొలిసారి. కలందర్స్‌ సెమీఫైనల్లో మంగళవారం కరాచీ కింగ్స్‌ను ఢీకొట్టనుంది.

ఐసోలేషన్‌కు వెళ్లనున్న లిన్:

ఐసోలేషన్‌కు వెళ్లనున్న లిన్:

ఈ మ్యాచ్‌ అనంతరం క్రిస్‌ లిన్‌ తిరిగి స్వదేశానికి బయలుదేరుతున్నట్లు ప్రకటించాడు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్ కరోనా వైరస్‌ (కోవిడ్-19 ) కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం సోమవారం అర్ధరాత్రి నుంచి కఠిన ఆంక్షలు విధించనుంది. ఇతర దేశాల నుంచి వచ్చేవారు 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించింది. దీంతో లిన్‌ ఆస్ట్రేలియాకు చేరుకున్నాక.. ఐసోలేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. లిన్ ఆసీస్ వెళుతున్న కారణంగా లాహోర్‌కు భారీ షాక్ తగిలింది.

 జీవితం కంటే క్రికెట్ ఎక్కువ కాదు:

జీవితం కంటే క్రికెట్ ఎక్కువ కాదు:

లిన్‌ ఆస్ట్రేలియాకు వెళుతున్న సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు పెట్టాడు. 'పీఎస్‌ఎల్‌లో ఆడటాన్ని ఆస్వాదించా. ప్రస్తుతం కరోనా కారణంగా నెలకొన్న అనివార్య పరిస్థితుల్లో నేను స్వదేశానికి తిరిగి వెళ్తున్నా. ఇలాంటి కఠిన పరిస్థితులలో జీవితం కంటే క్రికెట్ ఎక్కువ కాదని నా అభిప్రాయం. పీఎస్‌ఎల్‌ జాయమాన్యానికి, ఆటగాళ్లకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కలందర్స్‌ టీమ్‌ పీఎస్‌ఎల్‌లో విజేతగా నిలుస్తుంది' అని లిన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఒక్క పీఎస్‌ఎల్‌ మాత్రమే కొనసాగుతోంది:

ఒక్క పీఎస్‌ఎల్‌ మాత్రమే కొనసాగుతోంది:

కరోనా దెబ్బకు ఆటలన్నీ ఆగమాగమయ్యాయి. ఇప్పటికే భారత్-దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్, బంగ్లాదేశ్-పాకిస్తాన్‌ సిరీస్‌లు రద్దయ్యాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ వాయిదా పడింది. క్రికెటేతర టోర్నీలు కూడా జరగడం లేదు. ఈ మహమ్మారి దెబ్బకు యావత్ క్రీడాలోకమే అతలాకుతలమైంది. కానీ.. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2020 సీజన్ మాత్రమే కొనసాగుతోంది. అయితే ప్రేక్షకులు లేకుండా జరుగుతుంది.

Story first published: Tuesday, March 17, 2020, 7:50 [IST]
Other articles published on Mar 17, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+