For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేకేఆర్‌పై కోపంతోనే! అలెక్స్ హేల్స్ రికార్డు బద్దలు కొట్టిన క్రిస్‌లిన్

Chris Lynn Lights Up T10 With Highest Score || Oneindia Telugu
Chris Lynn shatters Alex Hales record of highest individual T10 score

హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 19వ తేదీన కోల్‌కతాలో ఆటగాళ్ల వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల బదిలీలకు సంబంధించి శుక్రవారం తుది గడువు కావడంతో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను ఫ్రాంఛైజీలు వేలానికి విడుదల చేశాయి. ఇలా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ వదిలేసిన ఆటగాళ్లలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ క్రిస్ లిన్ ఒకడు.

అయితే, కేకేఆర్ తనను వేలానికి విడుదల చేసిందన్న కోపమో ఏమో గానీ, అబుదాబి వేదికగా ప్రస్తుతం జరుగుతున్న టీ10 లీగ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో టీ10 లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో క్రిస్ లిన్ మరాఠా అరేబియన్స్‌ జట్టు తరుఫున ఆడుతున్నాడు.

సోమవారం షేక్‌ జయ్యద్‌ స్టేడియంలో అబుదాబి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ లిన్ 30 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు, ఏడు సిక్సుల సాయంతో 91 పరుగులు చేశాడు. క్రిస్ లిన్ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌కు తొలుత బ్యాటింగ్‌ చేసిన మరాఠా అరేబియన్స్‌ జట్టు 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అబుదాబి జట్టు నిర్ణీత 10 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో మరాఠా అరేబియన్స్‌ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. గత సీజన్‌లో మరాఠా అరేబియన్స్‌ జట్టుకు చెందిన ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ ఆలెక్స్‌ హేల్స్‌ 32 బంతుల్లో 87 నాటౌట్‌గా నిలిచాడు.

షార్జా వేదికగా బెంగాల్ టైగర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ ఫైనల్ మ్యాచ్‌లో అలెక్స్ హేల్స్ అత్యధిక వ్యక్తిగత స్కోరుని నమోదు చేశాడు. ఈ టీ10 లీగ్‌లో అత్యధిక స్కోరు. ఇప్పుడు ఆ స్కోరుని క్రిస్ లిన్ అధిగమించాడు. అలెక్స్ హేల్స్‌ను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. ఇక, క్రిస్ లిన్ ఐపీఎల్‌లో కోల్‌కతా తరఫున 41 మ్యాచ్‌లు ఆడి 1280 పరుగులు చేశాడు.

Story first published: Tuesday, November 19, 2019, 15:02 [IST]
Other articles published on Nov 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+