For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రిస్ లిన్.. ఫించ్‌లను పల్టీకొట్టించిన కుల్దీప్

India vs Australia 1st T20I : Kuldeep Yadav Sents Aaron Finch To Dressing Room At 42 Runs| Oneindia
Chris Lynn c and b Kuldeep Yadav 37(20)

హైదరాబాద్: తొలి వికెట్‌ను తీసుకుని ఆస్ట్రేలియా పతనాన్ని ఆరంభించిన ఖలీల్‌కు.. కుల్దీప్ యాదవ్ తోడైయ్యాడు. తొమ్మిదో ఓవర్, పదో ఓవర్లలో రెండు వికెట్లు తీసి క్రిస్ లిన్, ఫించ్‌లను పెవిలియన్‌కు పంపాడు. 11ఓవర్లు ముగిసే సరికి కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టి 16 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతకంటే ముందు తొలి వికెట్‌ను ఖలీల్ అహ్మద్.. తీశాడు.

ఖలీల్ అహ్మద్ బౌలింగ్ చేసిన నాలుగో ఓవర్ తొలి బంతికే ఓపెనర్ డార్సీ షార్ట్‌ షాట్ కొడదామని ప్రయత్నించి కుల్దీప్‌ క్యాచ్‌ పట్టడంతో ఔట్ అయ్యాడు. 12బంతులు ఆడిన షార్ట్ 7పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆసీస్‌ను కట్డడి చేసేందుకు పన్నిన వ్యూహాన్ని టీమిండియా సరిగ్గా అమలు చేస్తోంది.

1
43620

బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. తన బౌన్సర్లతో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు భువీ. ఇలా 2 ఓవర్లు ముగిసే సరికి కేవలం ఆస్ట్రేలియా 5పరుగులు మాత్రమే చేయగలిగింది.

తొలి టీ20లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌ పరిస్థితులు బౌలింగ్‌కే అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఫీల్డింగ్‌ ఎంచుకున్నట్లు కోహ్లీ చెప్పాడు. మరోవైపు ముందుగా టాస్‌ గెలిస్తే తాము కూడా బౌలింగ్‌ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఆసీస్‌ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ అన్నాడు. ఆసీస్ గడ్డపై మొత్తం మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌తో ఆసీస్ గడ్డపై సుదీర్ఘ పర్యటనకు టీమిండియా శ్రీకారం చుట్టబోతోంది.

Story first published: Wednesday, November 21, 2018, 14:26 [IST]
Other articles published on Nov 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+