Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రిస్‌గేల్ మెరుపు ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా!

ICC Cricket World Cup 2019 : Chris Gayle Entertains The Crowd In Typical 'Universe Boss' Style
Chris Gayle Wins Internet With His Swag After The Universe Boss Dives To Stop The Ball

మాంఛెస్ట‌ర్‌: క్రిస్ గేల్‌. విధ్వంసక ఓపెన‌ర్‌గా మాత్ర‌మే క్రికెట్ ప్రియుల‌కు చిర‌ప‌రిచితుడు. పార్ట్ టైమ్ స్పిన్న‌ర్‌. రెగ్యుల‌ర్ బౌల‌ర్ కాదు. ఎప్పుడో జ‌ట్టుకు అవ‌స‌ర‌మైనప్పుడు త‌ప్ప పెద్ద‌గా బౌలింగ్ చేయ‌డు. వెస్టిండీస్ ఓపెన‌ర్‌గా వ‌చ్చే క్రిస్ గేల్ ఒక్క‌సారి క్రీజులో కుదురుకున్నాడంటే బౌల‌ర్ల‌కు ప‌ట్ట‌ప‌గ‌లు చుక్క‌లు క‌నిపిస్తాయి. ఇందులో సందేహాలు అన‌వ‌సరం. ఫీల్డింగ్‌లో పెద్ద‌గా చురుకుగా క‌ద‌ల‌డనే అప‌వాదు కూడా క్రిస్ గేల్‌కు ఉంది. బ‌ద్ధ‌కంగా క‌దులుతాడని చెబుతుంటారు అత‌ని అభిమానులు. అందుకే- క్రిస్ గేల్ నుంచి ఫీల్డింగ్‌లో పెద్ద‌గా మెరుపుల‌ను ఆశించ‌రు.

 ఫ్యాన్స్ ఫిదా..!

ఫ్యాన్స్ ఫిదా..!

అందుకే- అత‌ణ్ని ఎప్పుడూ బౌండరీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ మోహ‌రింప‌జేయ‌దు వెస్టిండీస్ టీమ్‌. అత‌ని ఫీల్డింగ్ పొజీష‌న్ స్పిప్‌. స్లిప్ ఫీల్డింగ్‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాడు క్రిస్ గేల్‌. అదే పొజీష‌న్‌లో ఉంటూ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడత‌ను. అత‌ని ఫీల్డింగ్ సోష‌ల్ మీడియా ఫిదా అయిపోయింది. స‌లాం కొడుతోంది. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా- గురువారం మాంఛెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో టీమిండియాతో మ్యాచ్ సంద‌ర్భంగా క్రిస్ గేల్ చేసిన ఫీల్డింగ్ అబ్బుర ప‌రిచింది.

బౌండరీ వెళ్లే బంతిని డైవ్ చేసి..!

బౌండరీ వెళ్లే బంతిని డైవ్ చేసి..!

మ్యాచ్ 20వ ఓవ‌ర్ సంద‌ర్భంగా ఈ అద్భుత దృశ్యం చోటు చేసుకుంది. ఫ్యాబియ‌న్ అలెన్ బౌలింగ్‌లో స్ట్రైకింగ్‌లో ఉన్న కేప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాక్‌వ‌ర్డ్ పాయింట్ వైపు క‌ట్ షాట్ ఆడాడు. బంతిని బౌండ‌రీ లైన్‌ను దాటించే షాట్ అది. .. బౌండ‌రీ వైపు దూసుకెళ్తున్న బంతిని పాయింట్‌లో ఫీల్డింగ్‌లో ఉన్న క్రిస్ గేల్ ఆపిన తీరు అద్భుతం. అల్లంత దూరంలో వెళ్తున్న బంతిని డైవ్ చేసి మ‌రీ ఆపాడు గేల్‌. నాలుగు ప‌రుగులు రావాల్సిన చోట ఒక్క ర‌న్ కూడా ఇవ్వ‌లేదు.

కోహ్లీ సైతం ప్ర‌శంస‌..

కోహ్లీ సైతం ప్ర‌శంస‌..

గేల్ ఫీల్డింగ్‌ను చూసిన అభిమానులు ఫిదా అయిపోయారు. గ‌ట్టిగా చ‌ప్ప‌ట్లు కొడుతూ త‌మ ఆనందాన్ని వ్య‌క్తంచేశారు ప్రేక్ష‌కులు. దీనికి విచిత్రంగా స్పందించాడు గేల్‌. రెండు చేతులు ఎత్తి ఆశీర్వ‌దిస్తున్న త‌ర‌హాలో వారికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకొన్నాడు. ఆ వెంట‌నే- దీనిపై మెమెలు రెడీ అయిపోయాయి. బాబా క్రిస్ గేల్ ప్రేక్ష‌కుల‌ను ఆశీర్వ‌దిస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజ‌న్లు, ట్విట్ట‌రెట్టీలు. గేల్ ఫీల్డింగ్‌ను విరాట్ కోహ్లీ సైతం ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేక‌పోయారు. త‌న బ్యాట్‌ను త‌డుతూ క‌నిపించాడు కోహ్లీ.

Story first published: Thursday, June 27, 2019, 19:12 [IST]
Other articles published on Jun 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+