మహిళా మసాజ్ థెరపిస్ట్‌తో వెకిలి చేష్టలు: కేసు గెలిచిన క్రిస్ గేల్
హైదరాబాద్: పరువు నష్టం దావా కేసులో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు వెలువరించింది. ఆస్ట్రేలియా ఫెయిర్ ఫాక్స్ మీడియాకు చెందిన ద సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ద ఏజ్, ద కాన్‌బెర్రా టైమ్స్ తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే తప్పుడు కథనాలు ప్రచురించాయని గత వారం క్రిస్ గేల్ ఎన్ఎస్‌డబ్ల్యూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు క్రిస్ గేల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.
అసలేం జరిగింది?
2015 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. ఈ వరల్డ్ కప్ సందర్భంగా క్రిస్ గేల్ డ్రస్సింగ్ రూమ్‌లో మహిళా మసాజ్ థెరపిస్ట్ రస్సెల్‌కు తన మర్మాంగాన్ని చూపించి అసభ్యంగా ప్రవర్తించాడని గతేడాది జనవరిలో ఫెయిర్‌ఫాక్స్ మీడియాకు చెందిన పత్రికలు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ద ఏజ్, ద కాన్‌బెర్రా టైమ్స్ వరుస కథనాలు ప్రచురించాయి.
ఈ వార్తలపై క్రిస్ గేల్ మసాజ్ థెరపిస్ట్‌తో నేను తప్పుగా ప్రవర్తించలేదని. మీడియాలో వచ్చిన ఆ వార్తలు నన్ను ఎంతగానో బాధించాయని పేర్కొన్నాడు. ఈ కేసు విషయంలో తాను పోరాడాల్సి ఉందని, అందుకే ఫెయిర్ ఫాక్స్ మీడియా సంస్ధపై పరువు నష్టం దావా వేశానని పేర్కొన్నాడు.

ఫెయిర్ ఫాక్స్ మీడియా యాజమాన్యంపై కోర్టు ఆగ్రహం
దీనిపై విచారణ జరిపిన ఎన్‌ఎస్‌డబ్ల్యూ సుప్రీంకోర్టు ఫెయిర్ ఫాక్స్ మీడియా యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఫెయిర్ ఫాక్స్ మీడియా క్రిస్ గేల్... మహిళా మసాజ్ థెరిపిస్ట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే దానికి ఆధారాలను కూడా చూపెట్టలేకపోయింది.
‘పాఠకులను ఆకట్టుకునే విధంగా వార్తలు రాస్తున్నారే తప్ప, అందులో ఎంతవరకు నిజం ఉన్నదో అనే దానిపై దృష్టి పెట్టడం లేదు. దేశానికి ప్రాతినిథ్యం వహించే వ్యక్తి పట్ల ఇలా ఎలా రాస్తారు' అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గేల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

తీర్పు పట్ల క్రిస్ గేల్ సంతోషం
అయితే, కోర్టు తీర్పు తనకు అనుకూలంగా రావడం పట్ల క్రిస్ గేల్ సంతోషం వ్యక్తం చేశారు. ‘నేను మంచి వ్యక్తిని. సిగ్గుగా ఏమీ ఫీలవ్వడం లేదు. చాలా సంతోషంగా ఉన్నా' అని కాస్తంత ఎమోషనల్‌గా మాట్లాడాడు. ఈ కేసు విచారణలో జట్టు సహచర ఆటగాడు డ్వేన్ స్మిత్ సైతం కోర్టు విచారణలో క్రిస్ గేల్‌కు అండగా నిలిచాడు.

ఆ రోజు రూమ్‌లో ఏం జరిగిందో చెప్పిన మహిళా మసాజ్ థెరపిస్ట్
మరోవైపు ఈ కేసు విచారణకు హాజరైన మహిళా మసాజ్ థెరపిస్ట్ ఆ రోజు ఛేంజింగ్ రూమ్‌లో ఏం జరిగిందో వివరించింది. 'టవల్ కోసం నేను డ్రెస్ చేంజింగ్ రూమ్‌కు వెళ్లాను. టవల్ కట్టుకొని ఉన్న గేల్ ఎదురుపడ్డాడు. ఏం వెతుకుతున్నావు అని అడిగాడు. టవల్ అని నేను చెప్పాను' అని ఆమె తెలిపింది.

కన్నీరుమున్నీరుగా ఏడ్చిన మసాజ్ థెరపిస్ట్
'వెంటనే క్రిస్ గేల్ తన టవల్ విప్పి ఇదేనా అంటూ నగ్నంగా నా ముందు నుంచున్నాడు. ఈ సమయంలో క్రిస్ గేల్ మర్మాంగాన్ని కూడా చూశాను. వెంటనే చూపు తిప్పుకొని క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను. వెంటనే వెస్టిండీస్ జట్టు ఫిజియోథెరపిస్ట్‌కు జరిగింది చెప్పి కన్నీరుమున్నీరుగా ఏడ్చేశాను' అని ఆమె కోర్టులో వివరించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications