Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

1st ODI: హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన పాండ్యా, భారత్ 205/6

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టీ20లో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 52 మ్యాచ్‌లు ఆడిన గేల్‌ 1577 పరుగులు చేశాడు.

ఇందులో 13 హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలతో పాటు 103 సిక్సర్లు, 134 ఫోర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్‌తో జరిగిన ఏకైక టీ20లో వెస్టిండిస్ ఘన విజయం సాధించింది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ జట్టును ఓడించింది.

వెస్టిండిస్ ఆటగాళ్లు సమిష్టిగా అద్భుత ప్రదర్శన చేశారు. క్రిస్‌ గేల్‌, లూయిస్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ముందుగా బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. గేల్‌ 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. లూయిస్‌ 28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు.

అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 19.3 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. విండీస్‌ బౌలర్లలో బ్రాత్‌వైట్‌, విలియమస్స్‌ మూడేసి వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌‍లో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సునీల్‌ నరైన్‌ 'మ్యాన్‌ ది మ్యాచ్‌' దక్కించుకున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+