వరల్డ్‌కప్ తర్వాత వన్డే ఫార్మాట్‌కు క్రిస్ గేల్ వీడ్కోలు


హైదరాబాద్: వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఈ ఏడాది జరుగనున్న వన్డే వరల్డ్‌కప్ తర్వాత వన్డేలకు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించాడు. మేలో ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వరల్డ్‌కప్ టోర్నీ వన్డేల్లో అతడికి చివరి టోర్నీ. వరల్డ్‌కప్ అనంతరం తాను వన్డేల నుంచి తప్పుకోవాలని గేల్ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు వెస్టిండిస్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది.

1999లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన క్రిస్ గేల్
39 ఏళ్ల గేల్ 1999 సెప్టెంబరులో భారత్‌పై టొరంటో వేదికగా జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. వన్డే ఫార్మాట్‌లో బ్రియాన్ లారా (10,405) తర్వాత అత్యధిక పరుగులు చేసిన వెస్టిండిస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేలే కావడం విశేషం. అంతేకాదు వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన (2015 వరల్డ్‌కప్‌లో జింబాబ్వేపై) ఏకైక వెస్టిండీస్ క్రికెటర్ గేలే.

విండిస్ బోర్డులో విభేదాలు
దాదాపు 20 ఏళ్ల కెరీర్ ఉన్నప్పటికీ వెస్టిండిస్ బోర్డుతో విభేదాల కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. గేల్ చివరగా గత ఏడాది జులైలో వన్డే ఆడాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడనున్నాడు. ప్రపంచకప్‌లో బరిలోకి దిగి.. అంతటితో ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు.

ప్రపంచ వ్యాప్తంగా అనేక టీ20ల్లో
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక టీ20 లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. టీ20 ఫార్మాట్‌లో క్రిస్ గేల్ సుడిగాలి ఇన్నింగ్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. విండిస్ తరుపున 284 వన్డేలాడిన గేల్ 9727 పరుగులు చేశాడు. ఇక, 20వ శతాబ్దంలో అరంగేట్రం చేసి ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఇద్దర క్రికెటర్లలో గేల్ ఒకడు. మరొకరు పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications