Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంతకంటే నన్ను చంపేయాల్సింది: క్రిస్ గేల్

Chris Gayle Wants To Kill Himself After Yuzvendra Chahal Challenged Him To A Weightlifting Contest

హైదరాబాద్: మీరలా చూడకండి.. చచ్చిపోవాలనిపిస్తుంది. ఇది అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్. ఇదే మాదిరి క్రిస్ గేల్ కూడా యుజవేంద్ర చాహల్ విసిరిన సవాల్‌కు క్రిస్ గేల్ కూడా ఇలానే స్పందించాడు. టీమిండియా యువ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ విసిరిన ఆసక్తికర సవాల్‌ తరువాత సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న చర్చపై విండీస్ విధ్వంసక హిట్టర్ క్రిస్‌గేల్ ఇలా స్పందించండి.

'ఇక నన్ను చంపేయండి' అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.
ఏ విషయాన్నైనా స్పోర్టివ్‌గా తీసుకునే గేల్‌.. చంపేయండి అంటూ సరదాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

గత ఏడాది టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లో నిలిచిన టీమిండియా స్పిన్నర్ చాహల్.. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్దమవుతున్నాడు. ఇందులో భాగంగా ఫిటెనెస్ పెంచుకునేందుకు తాను జిమ్‌లో శ్రమిస్తున్న వీడియోని చాహల్.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ఈ వీడియో చూసిన విండీస్‌ క్రికెటర్ షంషీ.. ఈ బరువులు ఎత్తుతోంది చాహల్ లేదా క్రిస్‌గేల్‌..? అంటూ కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన చాహల్.. ' నేను క్రిస్‌గేల్ కంటే ఎక్కువ బరువులు ఎత్తగలను. ఇది నా వార్మప్ సెట్ మాత్రమే' అని సమాధానమిచ్చాడు.

ఈ చాట్‌పై స్పందించిన క్రిస్‌గేల్ తనదైన శైలిలో బదులిచ్చాడు. ఇక నన్ను చంపేయండి అంటూ సెటైర్‌ వేశాడు. గత ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున చాహల్, క్రిస్‌గేల్ మ్యాచ్‌లు ఆడిన విషయం తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 12, 2018, 18:09 [IST]
Other articles published on Jan 12, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+