Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అచ్చం రొనాల్డోలా: ముందే చెప్పానన్న గేల్, సిక్స్ కొట్టినా రాలేదు!

బెంగళూరు: విఖ్యాత ఫుట్ బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఫ్యాన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ బుధవారం అచ్చం అతడిని అనుకరించాడు. గేల్ సెంచరీ చేసిన తర్వాత ఇచ్చిన ఫోజు అందర్నీ ఆకట్టుకుంది. మ్యాచ్ అనంతరం అతను మాట్లాడాడు.

సెంచరీతో అభిమానులకు ఆనందం పంచడం ఆనందంగా ఉందని, మద్దతుగా నిలిచిన అందరీకి కృతజ్ఞతలు అని చెప్పాడు. గత మ్యాచ్ ఆడకపోవడంతో పూర్తిగా విశ్రాంతి తీసుకున్నని చెప్పాడు. తాను రొనాల్డో అభిమానిని అని, సెంచరీ చేస్తే అతనిలాగే సంబరాలు చేసుకుంటానని మా సహచరులతో ముందే చెప్పానని అన్నాడు.

సిక్స్ కొట్టినా...

Chris Gayle 'unveils' Cristiano Ronaldo in Bengaluru

బుధవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఓ సిక్స్ కొట్టినా అది లెక్కలోకి రాలేదు! పంజాబ్ ఆటగాడు అనురీత్ వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి గేల్ సిక్స్ కొట్టాడు. అయితే, అది పైనున్న కేబుల్‌ను తాకి సిక్స్‌గా వెళ్లింది. దీంతో, దానిని పరిగణలోకి తీసుకోలేదు. అనురీత్ దానికి బదులు మరో బంతి వేశాడు. ఆ బంతికి గేల్ ఫోర్ కొట్టాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+