Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి విదేశీ: క్రిస్ గేల్ రికార్డ్‌లే రికార్డులు, 4ఏళ్ల క్రితం సేమ్ టు సేమ్

బెంగళూరు: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ రెచ్చిపోవడంతో.. పంజాబ్ 138 పరుగుల తేడాతో చిత్తయింది. గేల్ అభిమానులకు ఎంతో వినాదాన్ని పంచాడు. కేవలం సిక్స్‌లు (12), ఫోర్లు(7)తోనే వంద పరుగులు చేశాడు.

శతకం చేసే క్రమంలో అతడు ఐపీఎల్లో 3,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మూడువేల పరుగుల మైలురాయి అందుకున్న నాలుగో ఆటగాడు గేల్. ఈ ఘనత సాధించిన తొలి విదేశీ ఆటగాడు క్రిస్ గేల్ కావడం విశేషం.

ట్వంటీ 20ల్లో గేల్‌కు ఇది 14వ సెంచరీ. మరే ఆటగాడూ అతడికి చేరువలో లేడు. బ్రెండన్ మెకల్లమ్ ఆరు శతకాలతో కరిస్ గేల్ తర్వాత స్థానంలో ఉన్నాడు. గేల్ పంజాబ్ పైన మొత్తం ఏడుసార్లు 50కి పైగా స్కోర్లు చేశాడు. టీ20ల్లో ఒకే ప్రత్యర్థి పైన అత్యధిక 50 ప్లస్ పరుగులు చేసిన ఘనత గేల్‌దే.

Chris Gayle ton leads RCB to their biggest win

ఐపీఎల్లో ఓ ఆటగాడు ఓ మ్యాచ్‌లో 12 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టడం ఇది నాలుగోసారి. అందులో గేల్ ఒక్కటే మూడుసార్లు కొట్టాడు. బుధవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేయగానే బ్యాట్ వదిలేసి గేల్ ఇచ్చిన ఫోజు అందర్నీ ఆకట్టుకుంది.

నాలుగేళ్ల క్రితం 2011 మే 6న బెంగళూరులో పంజాబ్‌తో జరిగిన మ్యాచులో గేల్ సెంచరీ చేశాడు. అదే మ్యాచ్‌లో శ్రీనాథ్ అరవింద్ కూడా నాలుగు వికెట్లు తీశాడు. ఇప్పుడు కూడా శ్రీనాథ్ అరవింద్ నాలుగు వికెట్లు తీయగా, గేల్ సెంచరీ చేయడం విశేషం.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+