క్రిస్ గేల్ సుడిగాలి ఇన్నింగ్స్: ఒక ఓవర్‌లో 6-6-4-4-6-6 (వీడియో)

హైదరాబాద్: కెనడా వేదికగా జరుగుతున్న గ్లోబల్ టీ20 టోర్నీలో యానివర్సల్ బాస్ క్రిస్ గేల్ సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా శుక్రవారం వాన్‌కూవర్ నైట్స్, ఎడ్మాంటన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వాన్‌కూవర్ నైట్స్ జట్టు తరఫున ఆడిన క్రిస్ గేల్ బౌండరీల మోత మోగించాడు.
44 బంతుల్లో 94 పరుగులు చేసిన గేల్
44 బంతుల్లో 9 సిక్సర్లు, 6 ఫోర్లతో 94 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. గేల్ విజృంభణతో వాన్‌కూవర్ జట్టు 16.3 ఓవర్లలో 166 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎడ్మాంటన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
166 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి
ఎడ్మాంటన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ బెన్ కట్టంగ్(72), మహ్మద్ నవాజ్(40)లు మాత్రమే రాణించారు. అనంతరం 166 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వాన్‌కూవర్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు రెండు పరుగుల వద్ద విసీ(1) పెవిలియన్ చేరాడు.
గేల్ సుడిగాలి ఇన్నింగ్స్
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చాద్వక్ వాల్టన్‌తో కలిసి క్రిస్ గేల్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించిన తర్వాత వాల్టన్(17) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రిస్ గేల్ మరింత దూకుడుగా ఆడాడు. షోయబ్ మాలిక్(34 నాటౌట్)తో కలిసి మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
6 వికెట్ల తేడాతో విజయం
ఆ తర్వాత బెన్ కటింగ్ బౌలింగ్‌లో క్రిస్ గేల్ బౌండరీ లైన్ వద్ద మహ్మద్ నవాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. గేల్ ఔటైన తర్వాతి బంతికే రసెల్ కూడా ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మాలిక్ సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో వాన్‌కూవర్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications