క్రిస్ గేల్: బ్యాటుతోనే కాదు.. బౌలింగ్‌లోనూ మెరిశాడు
కాన్‌బెర్రా: విధ్వంసం అంటే ఎలా వుంటుందో ప్రపంచ కప్ టోర్నీలో మంగళవారం జింబాబ్వేతో జరిగిన మ్యాచులో చూపిన విండీస్ ఆటగాడు క్రిస్ గేల్.. బంతితోనూ రాణించాడు. కీలక సమయంలో రెండు వికెట్లు తీసి వెస్టిండీస్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచులో గేల్ ఆల్ రౌండ్ ప్రతిభను చాటుకున్నాడు.
41 బంతుల్లోనే 52 పరుగులు సాధించి, జింబాబ్వే స్కోరుబోర్డును చకచకా పరుగులు తీయిస్తున్న జింబాబ్వే కీలక ఆటగాడు ఇర్విన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత కొద్ది సేపటికే మట్సికెన్యెరిని 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్బీడబ్ల్యుగా వెనక్కి పంపాడు.

అంతకుముందు 177 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన జింబాబ్వే జట్టు నిలకడగా రాణిస్తూ 226 పరుగుల వరకు వికెట్ పడకుండా కాపాడుకుంది. అయితే.. ఉన్నట్టుండి గేల్ రంగంలోకి దిగడంతో తక్కువ పరుగుల తేడాతోనే రెండు వికెట్లు టపటపా రాలిపోయాయి. 226 పరుగుల వద్ద ఎర్విన్ ఆరో వికెట్ గాను, ఆ తర్వాత మరో 13 పరుగులకే మట్సికెన్యెరి వెనుదిరిగారు.
కాగా, తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండిస్ గేల్ విధ్వంసంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది. 373 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 44. 3 ఓవర్లలో 289 పరుగులకే ఆలౌట్ అయింది. వెస్టిండిస్ బౌలర్లలో తయ్లార్ 5, క్రిస్ గేల్ 2, ఆండ్రీ రస్సెల్ 2, హోల్డర్ ఒక వికెట్ తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications