గేల్ సుడిగాలి ఇన్నింగ్స్: ఐదో వన్డేలో విండీస్ విజయం, సిరిస్ సమం


హైదరాబాద్: వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ చెలరేగాడు. సిరీస్‌ను సమం చేయాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ (27 బంతుల్లోనే 77; 5 ఫోర్లు, 9 సిక్సర్లు) పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా శనివారం జరిగిన ఐదో వన్డేలో వెస్టిండీస్ 227 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. తొలి వన్డేలో ఇంగ్లండ్ విజయం సాధించగా, రెండో వన్డేలో విండీస్ గెలిచింది. ఇక మూడో వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, నాలుగో వన్డేలో ఇంగ్లాండ్ విజయం సాధించింది.

ఐదో వన్డే కీలకంగా
దీంతో ఐదో వన్డే కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 28.1 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌పై ఇంగ్లాండ్‌కు ఇదే అతి తక్కువ స్కోరు. బౌన్సీ పిచ్‌పై విండీస్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్‌లో థామస్ (5/21) దెబ్బకు ఇంగ్లాండ్ టాపార్డర్ చెల్లాచెదురైంది.

ఐదు వికెట్లు తీసిన థామస్
అలెక్స్ హేల్స్ (23), జోస్ బట్లర్ (23) టాప్ స్కోరర్లు. కెప్టెన్ మోర్గాన్ (18), స్టోక్స్ (15)తో సహా అందరూ విఫలమయ్యారు. విండిస్ బౌలర్లలో హోల్డర్, బ్రాత్‌వైట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టు 12.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. దీంతో 38 ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

ఆకాశమే హద్దుగా చెలరేగిన క్రిస్ గేల్
స్వల్ప లక్ష్యం కావడంతో క్రిస్ గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టీ20 క్రికెట్‌ను తలపిస్తూ భారీ షాట్లతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే 19 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి వెస్టిండీస్ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ మొత్తం 9 సిక్సర్లు బాదాడు.

గేల్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు
తొలి వన్డేలో 3 ఫోర్లు, 12 సిక్సర్లతో 135 పరుగులు చేసిన గేల్.. రెండో వన్డేలో 4 సిక్సర్లు, 1 ఫోర్ సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక మూడో వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, నాల్గో వన్డేలో 11 ఫోర్లు, 14 సిక్సర్లతో 162 పరుగులు చేశాడు. థామస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 39 సిక్సర్లు, 106 సగటుతో 424 పరుగులు చేసిన గేల్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications