Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఢిల్లీ అమ్మాయితో గేల్ డేటింగ్‌కు సై, కానీ....

హైదరాబాద్: పెళ్లయి ఓ బిడ్డకు తండ్రి కూడా అయిన స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ ఢిల్లీ అమ్మాయితో డేటింగ్‌కు అంగీకరించాడు. ఆ అమ్మాయి తన అభిమాని కావడం విశేషం. ఢిల్లీకి చెందిన ఆరోహి అనే యువతి క్రిస్‌ గేల్‌ అంటే చచ్చేంత అభిమానం. అభిమానులతో గేల్ సరదాగా చాట్‌ చేస్తుండగా ఆరోహి లైన్లోకి వచ్చింది.

"నీ కోసం నా హృదయం ఉవ్విళ్లూరుతోంది.. డేట్‌కి వెళ్దామా?" అంటూ గేల్‌కి ఆ అమ్మాయి ట్వీట్‌ చేసింది. దానికి గేల్ బదులిస్తూ ఓ షరతు పెట్టాడు. 'నువ్వే బిల్లు కడతానంటే తప్పకుండా వెళ్దాం' అని జవాబిచ్చాడు. ఇందుకు ఆరోహి అంగీకరించింది.

Chris Gayle says 'Yes' to date with Delhi girl but not without a condition

అయితే ఆమె కూడా తక్కువేమీ తినలేదు. ఆమె కూడా ఓ షరతు పెట్టింది. "నీ షరతుకి అంగీకరిస్తున్నా.. అయితే నాదీ ఓ షరతుంది. వచ్చే ఐపీఎల్‌ మ్యాచ్‌లో నువ్వు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున సెంచరీ కొట్టాలి" అని ట్వీట్‌ చేసింది.

ఈ ఐపిఎల్ సీజన్‌లో గేల్ పెద్దగా రాణించలేదు. మూడు మ్యాచుల్లో కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు. కానీ, లైమ్ లైట్‌లో ఉండడమెలాగో అతనికి తెలిసినంతగా మరొకరికి తెలిసినట్లు లేదు. అటువంటిదే ఈ డేటింగ్ చాటింగ్ కూడా.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+