For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ‌ళ్లీ అదే స్థాయిలో రెచ్చిపోయిన క్రిస్ గేల్ 51బంతుల్లో 126 ప‌రుగులు

 Chris Gayle's brutal 51-ball 126* for Rangpur Riders against Khulna Titans in BPL 2017

హైద‌రాబాద్‌: చాన్నాళ్ల తర్వాత వెస్టిండీస్‌ విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్ తనదైన శైలిలో ప‌రుగులు బాదాడు. బంగ్లాదేశ్‌ ప్రిమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌)లో రంగ్‌పూర్‌ రైడర్స్‌ జట్టుకు ఆడుతున్న గేల్‌.. ఢాకాలో జ‌రుగుతున్న బీపీఎల్‌లో కేవలం బౌండరీలతోనే గేల్‌ 108 పరుగులు చేయడం గమనార్హం.

శుక్రవారం ఖుల్‌నా టైటాన్స్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 45 బంతుల్లోనే సెంచరీ చేసిన గేల్ 51 బంతుల్లో 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గేల్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా 14 సిక్సర్లుండటం విశేషం. అంత‌కుముందు ఉన్న త‌న 12సిక్స‌ర్ల రికార్డును త‌నే దాటేశాడు. ఈ మ్యాచ్‌లో 14 సిక్ల‌ర్ల‌తో పాటు 6 ఫోర్లు కూడా కొట్టాడు.

ముందుగా టాస్ గెలుచుకున్న రంగ్‌పూర్ రైడ‌ర్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఖుల్నా టైటాన్స్ 6 వికెట్లు కోల్పోయి 167ప‌రుగులు చేసింది. గేల్ జ‌ట్టు 168 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. గేల్ టీ 20 మ్యాచ్‌ల్లో 800 సిక్సర్లు కొట్టిన రికార్డు సొంతం చేసుకున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 9, 2017, 10:17 [IST]
Other articles published on Dec 9, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+