జమైకా: క్రికెట్‌లో సిక్సర్లతో విరుచుకుపడుతూ అభిమానుల ఉర్రూతలూగించే వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్.. జీవితంలో ఆనందాన్ని కూడా అదే స్థాయిలో చేయాలంటున్నాడు. విధ్వంసకరమైన ఆటతీరుతో కేవలం విండీస్ జట్టుకే కాకుండా ఐపీఎల్, బిగ్ బాష్, కౌంటీ వంటి ఇతర ఫార్మాట్లకు కూడా గేల్ విలువైన ఆటగాడిగా పేరుతెచ్చుకున్న విషయం తెలిసిందే.

క్రికెట్ జీవితం గేల్‌కు కీర్తినే కాకుండా బోలెడు డబ్బును కూడా ఇచ్చింది. దీంతో, గేల్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. భారీ ఎత్తున టోర్నీల్లో పాల్గొనడంతోపాటు ఐపీఎల్ వంటి టోర్నీల్లో పాల్గోవడం వల్ల అతనికి మోడల్స్ కూడా పరిచయమయ్యారు. అంతే, ఇంట్లోనే స్ట్రిప్ క్లబ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు గేల్.
తనలా జీవితాన్ని ఏ ఆటగాడైనా ఎంజాయ్ చేయగలడా? అంటూ సహచరులకు సవాలు కూడా విసిరాడు. బ్యాచిలర్‌గా జీవితాన్ని గడుపుతున్న గేల్.. తన ఇంట్లో చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. అంతేగాక, తన ఇంటికి వచ్చిన అతిథులు వారింట్లో ఉన్నట్లుగానే భావించేలా చేస్తానని చెబుతున్నాడు.
దీంతో 'నీలా జీవించడం మావల్ల కాదు గురూ' అంటూ పలువురు ఆటగాళ్లు చేతులెత్తేశారు. గేల్ పోస్టు చేసే వీడియోలు అతని జీవనశైలిని ప్రతిబింబిస్తాయి. తాను కొన్ని ఫోటోలు విడుదల చేస్తేనే పరిస్థితి ఇలా ఉంది.. తాను దిగిన ఇతర ఫోటోలు విడుదల చేస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని గేల్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అంటే, గేల్ ఏ స్థాయిలో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.