Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్‌తో వన్డే సిరిస్: 39 ఏళ్ల వయసులో గేల్‌కు మళ్లీ పిలుపు

Chris Gayle returns to West Indies squad for England ODI series at age of 39

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు వెస్టిండిస్ డాషింగ్ హిట్టర్ క్రిస్ గేల్‌ జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. వన్డే జట్టుకు విండీస్‌ బోర్డు అతడిని ఎంపిక చేసింది. ఈ ఏడాది వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఈ సన్నాహాల్లో భాగంగా అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకున్నారు.

39 ఏళ్ల క్రిస్ గేల్ చివరిసారిగా గతేడాది జూలైలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు జట్టులో స్థానం సంపాదించాడు. మొత్తానికి చాలాకాలం తర్వాత గేల్‌ను తీసుకున్న విండీస్.. ఐదు వన్డేల సిరీస్‌కు 14 మందితో జట్టును ప్రకటించింది.

టి20ల్లో రాణించిన లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మన్‌ నికోలస్‌ పూరన్‌ తొలిసారిగా వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఫిబ్రవరి 20 నుంచి బార్బడోస్‌లో విండీస్‌-ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. దాదాపు ఏడు నెలల తర్వాత వన్డే జట్టులో ఆడనున్న క్రిస్‌ గేల్‌పైనే అందరి దృష్టి నెలకొంది.

"మా వరల్డ్‌కప్ సన్నాహాలు కొనసాగుతూనే ఉంటాయి. టాప్ ర్యాంక్ జట్టుతో మేం తలపడుతున్నాం. కాబట్టి బలమైన జట్టును బరిలోకి దించాలనుకుంటున్నాం. జట్టుగా మేం కుదురుకోవడానికి ఇదో మంచి అవకాశం" అని విండీస్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ కోట్నీ బ్రౌన్ తెలిపారు.

వెస్టిండిస్ వన్డే జట్టు:
జాసన్‌ హోల్డర్‌(కెప్టెన్‌), ఫాబియల్‌ అలెన్‌, దేవేంద్ర బిషూ, డారెన్‌ బ్రావో, క్రిస్‌ గేల్‌, హేట్‌మేయర్‌, షాయ్‌ హోప్‌, ఎవిన్‌ లూయిస్‌, ఆశ్లే నర్స్‌, కీమో పాల్‌, నికోలస్‌ పూరన్‌, రొవ్‌మాన్‌ పావెల్‌, కీమర్‌ రోచ్‌, ఒషానె థామస్‌

Story first published: Friday, February 8, 2019, 10:15 [IST]
Other articles published on Feb 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+