Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Chris Gayle: ధోనీ క్రేజ్ కా బాప్.. భారత ఆటగాళ్లకు రేటింగ్ ఇచ్చిన క్రిస్ గేల్

Chris Gayle: వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ ఐపీఎల్‌లో చాలా కాలం పాటు ఆధిపత్యం చెలాయించాడు. ఐపీఎల్‌లోని చాలా రికార్డులు ఇప్పటికీ క్రిస్ గేల్ పేరు మీద నమోద చేయబడ్డాయి. 2013లో పుణె వారియర్స్ క్రిస్ గేల్ 175 పరుగులు చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఓ బ్యాటర్ చేసి అత్యధిక స్కోరు. క్రిస్ గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు. భారత క్రికెట్ గురించి క్రిస్ గేల్ కు చాలా వరకు తెలుసు. ఈ క్రమంలో క్రిస్ గేల్ కొంత మంది భారత ఆటగాళ్లకు రేటింగ్ ఇచ్చాడు. మరోవైపు సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని క్రేజ్ గురించి కూడా క్రిస్ గేల్ మాట్లాడాడు. ఐపీఎల్‌కు ఎంఎస్ ధోని ఎంతో విలువ తీసుకోచ్చాడని గేల్ చెప్పాడు. మరింత వన్నె తేవడంలో ధోనిదే కీలక పాత్ర అని అన్నాడు.

భారత ఆటగాళ్లకు రేటింగ్ ఇచ్చిన క్రిస్ గేల్
వెస్టిండిస్ దిగ్గజం క్రిస్ గేల్ భారత ఆటగాళ్లకు రేటింగ్ ఇస్తూ ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. భారత క్రికెటర్ల రేటింగ్ ఇవ్వాల్సి వస్తే.." రుతురాజ్ గైక్వాడ్‌కు 7, యశస్వి జైస్వాల్‌కు 9, శుభ్‌మన్ గిల్‌కు 9 రేటింగ్ ఇస్తాను. సన్ రైజర్స్ హైదరాబాద్ కు అద్భుత ఆరంభాలు ఇచ్చిన అభిషేక్ శర్మకు 8 మార్కులు కేటాయిస్తా. కేఎల్ రాహుల్‌కు 8, సూర్యకుమార్ యాదవ్‌కు 9, హార్దిక్ పాండ్యాకు 7 మార్కులు ఇస్తాను. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ లకు చెరో 8 మార్కులు ఇస్తాను."అని క్రిస్ గేల్ వెల్లడించాడు.

Chris Gayle Rates Indian Players and Supports MS Dhoni s IPL Contribution

ధోనికి క్రిస్ గేల్ మద్దతు

ఇదిలా ఉండగా.. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడంపై విమర్శలు ఎదుర్కొంటున్న ఎంఎస్ ధోనికి క్రిస్ గేల్ మద్దతు ఇచ్చాడు. ఐపీఎల్‌కు ధోని చాలా ముఖ్యమని క్రిస్ గేల్ అభిప్రాయపడ్డాడు. ధోనితో ఐపీఎల్ కు విలువ పెరుగుతుందని.. అతడు ఎంతకాలం ఆడాలనుకుంటే అప్పటిదాకా కొనసాగించాలని అన్నాడు. ఐపీఎల్ నుంచి ధోని తప్పుకోవాలని ఎవరూ అనుకోవద్దన్నాడు. గొప్ప వ్యక్తిపై మనం అలా స్పందిస్తే అభిమానులకు తప్పుడు సందేశం వెళ్తుందన్నాడు. తన జట్టును ఛాంపియన్ గా నిలిపిన ధోని ఒక వేళ టోర్నీ నుంచి నిష్క్రమిస్తే సీఎస్కే కాదు.. టోర్నీకి కూడా ఇబ్బందికరమేనని క్రిస్ గేల్ అన్నాడు. ధోని లాంటి వ్యక్తికి మీరు అలాంటి సందేశం పంపకూడదని.. ఎందుకంటే ధోని ఐపీఎల్‌కు చాలా విలువను తీసుకొచ్చాడని క్రిస్ గేల్ పేర్కొన్నాడు.

ఈ సీజన్ లో 9వ నంబర్ లో ధోనీ బ్యాటింగ్ కు రావడం గేల్ స్పందించాడు. ధోని ఎక్కడ ఆడినా అభిమానులు భారీగా వస్తారని.. ఇలాంటి వ్యక్తితో ఐపీఎల్ విలువ భారీగా పెరుగుతూనే ఉంటుందన్నాడు. ఇప్పటికీ ఎంఎస్ ధోని వికెట్ కీపింగ్ నైపుణ్యం అద్భుతమని చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరూ ధోని నైపుణ్యాలను చూడాలనుకుంటారని.. ధోని 11వ స్థానంలో వచ్చినా ఇబ్బందేం లేదన్నాడు. ధోనిని మైదానంలో చూసేందుకే ఫ్యాన్స్ స్టేడియాలకు వస్తారని.. ధోని వల్లే ప్రేక్షకులు సీఎస్కేకు మద్దతు ఇస్తారని క్రిస్ గేల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, April 4, 2025, 15:00 [IST]
Other articles published on Apr 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+