Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టవల్ విప్పి నగ్నంగా నిల్చున్న గేల్: ఏడ్చిన మహిళా మసాజ్ థెరపిస్ట్

హైదరాబాద్: వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ తన ముందు నగ్నంగా ఎక్స్‌పోజ్‌ చేయడంతో తాను కన్నీరుమున్నీరుగా ఏడ్చేశానని ఆస్ట్రేలియాకు చెందిన మహిళా మసాజ్ థెరపిస్ట్‌ సిడ్నీ కోర్టులో వెల్లడించింది. వరల్డ్ కప్ సమయంలో ఓ మహిళా మసాజ్ థెరపిస్ట్‌తో గేల్ అభ్యంతరకరంగా ప్రవర్తించాడని ఆ దేశానికి చెందిన మీడియా సంస్ధలు గతేడాది జనవరిలో వరుస కథనాల్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.

మహిళా మసాజ్ థెరపిస్ట్‌తో గేల్ వెకిలి చేష్టలు: పరువు నష్టం దావా

ఫెయిర్‌ ఫాక్స్‌ మీడియాపై క్రిస్ గేల్ పరువు నష్టం దావా కేసు

ఫెయిర్‌ ఫాక్స్‌ మీడియాపై క్రిస్ గేల్ పరువు నష్టం దావా కేసు

ఈ నేపథ్యంలో తనకు వ్యతిరేకంగా లైంగిక ఆరోపణలు చేస్తూ కథనాలు రాసిన ఫెయిర్‌ ఫాక్స్‌ మీడియాకు చెందిన ద సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌, ద ఏజ్‌, ద కాన్‌బెర్రా టైమ్స్ పత్రికలపై క్రిస్ గేల్ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ దావాపై సోమవారం సిడ్నీ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే మీడియా తప్పుడు కథనాలు ప్రచురించిందని గేల్ పేర్కొన్నారు.

గేల్‌కు అండగా నిలిచిన డ్వేన్‌ స్మిత్‌

గేల్‌కు అండగా నిలిచిన డ్వేన్‌ స్మిత్‌

ఈ విచారణలో జట్టు సహచర ఆటగాడు డ్వేన్‌ స్మిత్‌ సైతం కోర్టు విచారణలో క్రిస్ గేల్‌కు అండగా నిలిచారు. కాగా, ఈ కేసు విచారణకు హాజరైన మహిళా మసాజ్ థెరపిస్ట్‌ ఆ రోజు ఛేంజింగ్ రూమ్‌లో ఏం జరిగిందో వివరించింది. 'టవల్‌ కోసం నేను డ్రెస్‌ చేంజింగ్‌ రూమ్‌కు వెళ్లాను. టవల్‌ కట్టుకొని ఉన్న గేల్‌ ఎదురుపడ్డాడు. ఏం వెతుకుతున్నావు అని అడిగాడు. టవల్‌ అని నేను చెప్పాను' అని ఆమె తెలిపింది.

టవల్‌ విప్పి ఇదేనా అంటూ నగ్నంగా ముందు నుంచున్నాడు

టవల్‌ విప్పి ఇదేనా అంటూ నగ్నంగా ముందు నుంచున్నాడు

'వెంటనే క్రిస్ గేల్ తన టవల్‌ విప్పి ఇదేనా అంటూ నగ్నంగా నా ముందు నుంచున్నాడు. ఈ సమయంలో క్రిస్ గేల్ పెనిస్‌ను కూడా చూశాను. వెంటనే చూపు తిప్పుకొని క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను. వెంటనే వెస్టిండీస్‌ జట్టు ఫిజియోథెరపిస్ట్‌కు జరిగింది చెప్పి కన్నీరుమున్నీరుగా ఏడ్చేశాను' అని ఆమె కోర్టులో వివరించింది.

మసాజ్ థెరపిస్ట్‌తో నేను తప్పుగా ప్రవర్తించలేదు

మసాజ్ థెరపిస్ట్‌తో నేను తప్పుగా ప్రవర్తించలేదు

2015 వరల్డ్‌ కప్‌ సందర్భంగా సిడ్నీలో తనపై క్రిస్‌ గేల్‌ అసభ్యంగా ప్రవర్తించాడని అప్పట్లో రస్సెల్‌ అనే మహిళా మసాజ్ థెరపిస్ట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై క్రిస్ గేల్ మాట్లాడుతూ ‘మసాజ్ థెరపిస్ట్‌తో నేను తప్పుగా ప్రవర్తించలేదు. మీడియాలో వచ్చిన ఆ వార్తలు నన్ను ఎంతగానో బాధించాయి. ఈ కేసు విషయంలో నేను పోరాడాల్సి ఉంది' అని సిడ్నీ కోర్టులో ఫెయిర్‌ ఫాక్స్‌ మీడియాపై పరువు నష్టం దావా కేసు వేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+