కోహ్లీకి ప్రేమతో క్రిస్‌గేల్ ఏమిచ్చాడో తెలుసా? (ఫోటోలు)
బెంగుళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విధ్వంసర బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన క్రిస్ గేల్ తన తోటి ఆటగాళ్లకు ఓ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చాడు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, క్రీడా జీవితం ఆధారంగా ''క్రిస్‌గేల్-సిక్స్ మెషిన్: ఐ డోన్ట్ లైక్ క్రికెట్... ఐ లవ్ ఇట్'' అనే పుస్తకాన్ని రచించిన సంగతి తెలిసిందే.
ఈ పుస్తకాన్ని క్రిస్ గేల్ రాయల్ ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఆటగాడైన ఏబీ డివిలియర్స్‌కు బహుకరించాడు. వీరిద్దరితో పాటు ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న యువరాజ్ సింగ్‌కు కూడా బహుమతిగా ఇచ్చాడు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురించింది.
తన తోటి క్రీడాకారులకు తన జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చిన అనంతరం తీసుకున్న ఫోటోలను క్రిస్‌గేల్ సోషల్ మీడియా వెబ్‌సైట్ ఇనిస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ పుస్తకంలో తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను ప్రముఖంగా పొందుపరిచాడు.

కోహ్లీకి ప్రేమతో క్రిస్‌గేల్ ఏమిచ్చాడో తెలుసా?
గతేడాది బిగ్‌బాష్ టీ20 లీగ్ సందర్భంగా మ్యాచ్ మధ్యలో తనను ఇంటర్వ్యూ చేస్తున్న మహిళా జర్నలిస్ట్ చార్లొట్‌తో తనది చాలా పెద్ద బ్యాట్ అంటూ డబల్ మీనింగ్ వచ్చేలా చేసిన వ్యాఖ్యలకు ఈ పుస్తకంలో వివరణ ఇచ్చాడు. మాజీ క్రికెటర్లు ఇయాన్ చాపెల్, ఆండ్రూ ప్లింటాఫ్ తదితరులపై గేల్ విరుచుకుపడ్డాడు.

కోహ్లీకి ప్రేమతో క్రిస్‌గేల్ ఏమిచ్చాడో తెలుసా?
'ప్రస్తుతం మనం టీ20ల యుగంలో ఉన్నాం. ఇది టెస్టు క్రికెట్ కాదు. ఇప్పుడు ఏదైనా భిన్నంగా చేయాలి. నేను సరదాగా జోక్ చేశానంతే. ఎవరినో అగౌరవపరచాలని కాదు' అని పేర్కొన్నాడు.

కోహ్లీకి ప్రేమతో క్రిస్‌గేల్ ఏమిచ్చాడో తెలుసా?
అంతేగాక, 'మ్యాచ్‌ల మధ్యలో వయాగ్రా మాత్రలు వాడే ఫ్లింటాఫ్ నాకు పాఠాలు చెప్పడమేంటి? అతనెప్పుడైనా నాకు షార్ట్ పిచ్ బంతి వేస్తే అది బ్యాక్‌వర్డ్ పాయింట్లో బౌండరీగా తేలేది. అతనో పిల్లవాడు. ఇక వెస్టిండీస్‌లో క్రికెట్ ఆడుతూ ఓ అధికారిని కొట్టి దోషిగా తేలిన ఇయాన్ చాపెల్ నన్ను క్రికెట్ నుంచి నిషేధించాలని డిమాండ్ చేస్తాడా? అతను మొత్తం క్రికెట్‌నే నిషేధించాలని కూడా అనగలడు' అని గేల్ విమర్శలు గుప్పించాడు.

కోహ్లీకి ప్రేమతో క్రిస్‌గేల్ ఏమిచ్చాడో తెలుసా?
తానో టెస్టు మ్యాచ్ సందర్భంగా వయాగ్రా మాత్రలు వాడి చాలా ఇబ్బంది పడ్డానని ఫ్లింటాఫ్ గతంలో అన్న నేపథ్యంలో గేల్ ఇలా చురకలంటించాడు. ఇది ఇలా ఉండగా, క్రిస్ రోజర్స్ పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు గేల్. తన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications