యూనివర్సల్ బాస్ విత్ యూనివర్సల్ థీఫ్

లండన్: భారత్‌లో బ్యాంకులకు 9000 కోట్ల రూపాయలకు పైగా కుచ్చుటోపీ పెట్టి, దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాను వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్.. కలుసుకున్నారు. ఫార్ములా వన్ బ్రిటిష్ గ్రాండ్ పిక్స్ ఈవెంట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఫార్ములా వన్ గ్రాండ్ పిక్స్‌ను చూడ్డానికి వెళ్లిన క్రిస్ గేల్‌ను విజయ్ మాల్యా కలుసుకున్నారు. ఇద్దరూ కలిసి ఓ ఫొటో దిగారు. ఈ పిక్‌ను క్రిస్ గేల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై భారత క్రికెట్ అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు.
బ్యాంకులకు బురిడి
బ్యాంకులకు బురడి కొట్టించిన ఇంగ్లండ్‌కు వెళ్లిపోయిన విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్న విషయం తెలిసిందే. బ్యాంకులకు సుమారు 9,000 కోట్ల రూపాయలకు పైగా రుణాలను బకాయి పడ్డారు ఆయన. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించలేక ఇంగ్లండ్‌కు పారిపోయారు. 2016 మార్చి 2వ తేదీన ఆయన గుట్టు చప్పుడు కాకుండా- లండన్ విమానం ఎక్కేశారు. ఇటీవలే- అక్కడి న్యాయస్థానానికి కూడా ఆయన హాజరయ్యారు. లార్డ్స్‌లో టీమిండియా ఆడిన మ్యాచ్‌ను చూడ్డానికి వెళ్లగా.. అక్కడి భారతీయులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాజాగా- ఆయన క్రిస్‌గేల్‌ను కలుసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ సారి నెటిజన్లు, ట్విట్టరెటీల చేతికి పని చెప్పినట్టయింది.
ఐపీఎల్ నాటి బంధం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫ్రాంఛైజీ యజమాని విజయ్ మాల్యా ఒకప్పుడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయ్ మాల్యా చేతుల్లో ఉన్న హయాంలో క్రిస్ గేల్ ఆ జట్టులో చాలాకాలం పాటు ఆడాడు. ఈ నేపథ్యంలో- వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. మ్యాచ్‌లు లేని సమయంలో క్రిస్ గేల్.. మాల్యాకు చెందిన రిస్టార్ట్స్‌లల్లో ఎంజాయ్ చేస్తుండేవాడు. గోవాలో మాల్యాకు చెందిన ఓ విల్లాలో గడిపిన ఫొటోలు కూడా అప్పట్లో వెలుగులోకి వచ్చాయి. యూనివర్సల్ బాస్ ఈజ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ అంటూ విజయ్ మాల్యా కూడా ట్వీట్ చేశారు.
మాల్యాను కొరియర్‌లో పంపించు..
వారిద్దరి మధ్య ఆ స్నేహబంధం ఇంకా కొనసాగుతూనే వస్తోందనడానికి సాక్ష్యం ఈ పిక్. గ్రాండ్ పిక్స్ చూడ్డానికి వెళ్లిన మాల్యా.. అక్కడే క్రిస్ గేల్ ఉన్నట్లు తెలియడంతో ఆయనను కలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఓ ఫొటో దిగారు. ఈ ఫొటోను చూసిన అభిమానులు ఇక రెచ్చిపోయారు. ఇద్దర్నీ కలిపి ట్రోల్ చేస్తున్నారు. పొరపాటున గానీ విజయ్ మాల్యాకు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వొద్దని, ఇస్తే.. అన్నీ ఖాళీ చేసేస్తాడని క్రిస్ గేల్‌కు సలహా ఇస్తున్నారు అభిమానులు. మాల్యాను కలుసుకున్న తరువాత పాకెట్‌లో తన వాలెట్ ఉందో? లేదో చెక్ చేసుకోవాలని గేల్‌కు సూచిస్తున్నారు. మాల్యాను వెంటనే కొరియర్‌లో పంపించాలని కోరుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications