Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: మరో ఘనత, సిక్సుల్లో చరిత్ర సృష్టించనున్న క్రిస్‌గేల్

బెంగుళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో టీమిండియా ఆటగాళ్ల కంటే వెస్టిండిస్‌కు చెందిన క్రిస్ గేల్‌కే అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఐపీఎల్‌లో క్రిస్ గేల్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

ఐపీఎల్‌లో మొత్తం 8 జట్లు ఉంటే, అన్ని జట్ల అభిమానులు ఇష్టపడే ఆటగాడు ఎవరంటే ఠక్కున చెప్పే సమాధానం క్రిస్ గేల్ పేరు మాత్రమే. అంతలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు ఐపీఎల్ టోర్నమెంట్‌లో క్రిస్ గేల్. అలాంటి క్రిస్ గేల్ ఐపీఎల్‌లో మరో అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమయ్యాడు.

 Chris Gayle one six away to 200 sixes in IPL

ఇప్పటి వరకు ఐపీఎల్‌లో క్రిస్ గేల్ 199 సిక్సులు బాదాడు. 200 సిక్సుల మైలురాయిని చేరుకునేందుకు కేవలం ఒక సిక్స్ దూరంలో నిలిచాడు. ఈరోజు బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఒక సిక్స్ సాధిస్తే ఐపీఎల్ చరిత్రలో 200 సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 69 మ్యాచ్‌‌లు ఆడాడు ఈ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్. ఇటీవల ఆస్టేలియాలో ముగిసిన వరల్డ్ కప్‌లో కూడా అత్యధిక సిక్సులు బాదిన ఆటగాడిగా క్రిస్ గేల్ నిలిచాడు. ఈ టోర్నమెంట్ మొత్తంలో 26 సిక్సులు సాధించాడు. క్రిస్ గేల్ తర్వాత ఐపీఎల్‌లో ఏబీ డివిలియర్స్ 21, మెక్ కల్లమ్ 17 సిక్సులతో ఆ తర్వాతి స్ధానాల్లో ఉన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+