ముంబై: విండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ తన కూతురుకు 'బ్లష్' అని పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతని భార్య నటాషా బెర్రిడ్జ్ పసిపాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
దీంతో గేల్ విండీస్ వెళ్లాడు. ఈ విషయాన్ని సహచర ఆటగాడు సర్పరాజ్ ఖాన్ రెండు రోజుల క్రితం చెప్పాడు. ఆదివారం బెంగళూరులో మ్యాచ్ ముగిసిన అనంతరం క్రిస్ గేల్ సరాసరి ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని ఖతార్ ఎయిర్ వేస్‌లో స్వదేశానికి బయల్దేరి వెళ్లాడు.
కాగా, ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్, ఏప్రిల్ 22న రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ జట్లతో జరిగే మ్యాచ్‌లలో క్రిస్ గేల్ ఆడే అవకాశం లేదు. ఆర్సీబీ అధికారి ఒకరు వన్ ఇండియాతో ఈ విషయాన్ని వెల్లడించారు.
తను ప్రయాణిస్తున్న విమానంలో 'ఐయామ్ ఆన్ దివే బేబీ' అని కేక్‌పై రాసి, దాన్ని ఫొటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు క్రిస్ గేల్. ఇదిలా ఉండగా, తన కూతురుకు బ్లష్ అని గేల్ పేరు పెట్టడం గమనార్హం.
Also Read: యాంకర్‌తో అసభ్య ప్రవర్తన: వివాదంలో క్రిస్‌గేల్
గతంలో బిగ్ బాష్ లీగ్ సందర్భంగా సిడ్నీ క్రికెట్ మైదానంలో ఓ మహిళా ప్రజెంటర్‌తో గేల్ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఆ టీవీ ప్రజెంటర్‌ను 'డోన్ట్ బ్లష్ బేబీ' (సిగ్గుపడకు బేబీ) అన్నాడు. ఆమెతో అనుచితంగా ప్రవర్తించినందుకు గేల్‌కు జరిమానా విధించారు. గేల్ కూడా.. తాను సరదాకే ఆ వ్యాఖ్యలు చేశానని, ఒకవేళ ఆమె బాధపడితే నా క్షమాపణలు అని చెప్పాడు. ఇప్పుడు తన కూతురుకు బ్లష్ అని నామకరణం చేశాడు.