న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై పోలీసు బైక్ ఎక్కి ఫోజులిస్తున్న క్రిస్ గేల్

Chris Gayle looks dashing on a Mumbai police motorbike

హైదరాబాద్: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ విరామంలో ఉన్నాడు. ఈ విండీస్ మాజీ క్రికెటర్ ఎక్కడ ఉన్నా వినోదం పంచడంలో ముందే ఉంటాడు. మైదానంలో ఉన్నంత సేపు బంతిని బౌండరీలకు పంపుతూ.. అభిమానులను హుషారెత్తిస్తుంటాడు. కొద్ది మ్యాచ్‌లలో అయితే సిక్సుల వర్షం కురిపిస్తూ.. ఫీల్డర్లకు పని లేకుండా చేస్తుంటాడు. ఇలా సిక్సులతో బంతిని గాల్లోనే ఉంచుతాడు. ఇవన్నీ కేవలం మైదానంలో ఉన్నప్పుడే కాదు.

అతను మ్యాచ్ పూర్తి అయి బయట తిరుగుతున్నప్పుడు కూడా అతని లైఫ్ స్టైల్‌తో అందరినీ తన వైపు తిట్టుకుంటాడు. అందులో భాగంగానే ఇటీవల ముంబైలో గేల్ చేసిన పనిని అభిమానులతో పంచుకున్నాడు. ముంబై వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న గేల్.. ముంబై లోకల్ పోలీసుల మోటార్ సైకిల్ ఎక్కి ఫోజిచ్చాడు. అలా గేల్ కూర్చొని ఉండగా పోలీసులు అతని వెనుక నుంచొని ఉన్నారు. ఓ గ్రేట్ బ్యాట్స్‌మన్ నగర వీధుల్లో అలా బైక్‌పై కూర్చొవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన గేల్ ఇలా పేర్కొన్నాడు. 'గ్రేట్‌ఫుల్-థ్యాంక్‌ఫుల్- ఐ లవ్ ఇండియా' భారత్‌లో ఉన్నందుకు గర్విస్తున్నాను. నాకు ఇండియా చాలా ఇష్టం అంటూ పేర్కొన్నాడు. కొన్ని దశాబ్దాలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న గేల్.. ప్రఖ్యాత దేశీవాలీ లీగ్ అయిన ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చాలా కాలం ప్రాతినిథ్యం వహించాడు. ఆఖరి సీజన్లో మాత్రం అతనిని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంతం చేసుకుంది.

ముంబై పోలీసులు క్రికెట్ పట్ల ప్రత్యేక ఆకర్షణ చూపిస్తున్నారు. గురువారం విరాట్ కోహ్లీ ఫొటోను ట్వీట్ చేసిన ముంబై పోలీస్ సోషల్ మీడియా.. అత్యంత్ వేగంగా పదివేల పూర్తి చేసిన కోహ్లీ మీకు నో స్పీడ్ లిమిట్ కోహ్లీ అద్భుత ఫీట్ అంటూ అభినందనలు తెలిపింది. తొలి వన్టేలో విజయాన్ని దక్కించుకున్న టీమిండియా రెండో వన్డేను టైతో సరిపెట్టుకోగా మూడో వన్డేను పుణెలో తలపడనుంది. ఇప్పటికే నాలుగో వన్డేను వాంఖడే నుంచి బ్రబౌర్న్‌కు తరలించడంతో 4వ వన్డను అక్కడే నిర్వహించనుంది.

Story first published: Friday, October 26, 2018, 15:02 [IST]
Other articles published on Oct 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X