
హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ క్రిస్ గేల్ బాదిన సిక్సు వర్షంలోనే స్టాండ్స్‌లోకి దూసుకెళ్లింది. చావ్లా వేసిన 9 ఓవర్ రెండో బంతిని గేల్ భారీ షాట్ ఆడాడు. ఇక బంతి గాల్లో ఉండగానే వర్షం ప్రారంభమైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేశారు.
వర్షంతో మ్యాచ్ నిలిపిపోయే సమయానికి 8.2 ఓవర్లు సాగిన ఆటలో పంజాబ్ వికెట్ నష్టపోకుండా 96 పరుగులు చేసింది. 27 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సులతో క్రిస్ గేల్ 49 పరుగులు చేయగా... మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 23 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్సుతో 43 పరుగులతో ఉన్నాడు. ఒక గంట తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ని 13 ఓవర్లకు కుదించారు.
డక్‌వర్త్ లూయిస్ ప్రకారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లక్ష్యాన్ని 125 పరుగులకు నిర్దేశించారు. ఆ లక్ష్యాన్ని కింగ్స్ పంజాబ్ 11.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో కోల్‌కతాపై పంజాబ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(60), క్రిస్ గేల్(62 నాటౌట్)లతో పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి జోరుమీదున్న పంజాబ్ ఓపెనర్లు క్రిస్‌గేల్, కేఎల్ రాహుల్ భారీ సిక్సర్లతో మ్యాచ్‌ని కొనసాగించారు. హాఫ్ సెంచరీ అనంతరం ఓపెనర్ కేఎల్ రాహుల్ పెవిలియన్‌కు చేరడంతో... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్(2)తో కలిసి క్రిస్‌గేల్ 11.1 ఓవర్లోనే పూర్తి చేశాడు.