Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాతో వన్డే సిరీస్.. విండీస్ జట్టులోకి గేల్

Mohammed Shami’s US Visa Gets Approved After BCCI Writes To Embassy || Oneindia Telugu
Chris Gayle included in West Indies squad for ODI series against India

అంటిగ్వా: రిటైర్మెంట్ విషయంలో మనసు మార్చుకున్న డాషింగ్‌ ఓపెనర్‌, 'యూనివర్స్ బాస్' క్రిస్‌ గేల్‌ భారత్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం వెస్టిండీస్ ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. సొంతగడ్డపై జరిగే వన్డే సిరీస్ కోసం 14 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును వెస్టిండీస్ బోర్డు శుక్రవారం ప్రకటించింది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతానని ఈ ఏడాది మార్చిలో గేల్ ప్రకటించాడు. ప్రపంచకప్ జరుగుతుండగానే మనసు మార్చుకొన్న గేల్‌.. భారత్‌తో సిరీస్ కోసం అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. గేల్‌ ప్రస్తుతం గ్లోబల్ టీ20 టోర్నీ ఆడుతున్నాడు. వచ్చే నెల 3న ప్రారంభమయ్యే టీ 20 సిరీస్‌కు గేల్‌ దూసరమయినా.. వన్డే సిరీస్ సమయానికి జట్టుతో చేరుతాడు.

విండీస్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగుల (10,405) రికార్డును అధిగమించేందుకు గేల్‌కు మరో 13 పరుగులు కావాలి. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు ఉన్న నేపథ్యంలో ఈ రికార్డును గేల్ అధిగమించే అవకాశం ఉంది. మరోవైపు విండీస్ జట్టులో క్యాంప్‌బెల్, రోస్టన్ చేస్, కీమో పాల్, కీమర్ రోచ్ కూడా జట్టులోకి వచ్చారు. టీమిండియా ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు వెస్టిండీస్‌తో ఆడనుంది. ఈ నెల 29న టీమిండియా వెస్టిండీస్‌కు బయలుదేరనుంది.

జట్టు:
జాసన్ హోల్డర్ (కెప్టెన్‌), ఫ్యాబియాన్ అల్లెన్, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, జాన్‌ క్యాంప్‌బెల్‌, రోస్టన్ చేస్, షెల్డాన్‌ కాట్రెల్‌, క్రిస్‌ గేల్‌, హెట్‌మెయిర్‌, షై హాప్, ఎవిన్‌ లూయిస్‌, కీమో పాల్‌, నికోలస్‌ పూరన్‌, కీమర్ రోచ్, ఓష్నీ థామస్‌.

Story first published: Saturday, July 27, 2019, 13:09 [IST]
Other articles published on Jul 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+