
టాప్‌లో క్రిస్ గేల్
ఐపీఎల్‌లో సిక్సులు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు క్రిస్ గేల్. సిక్సర్లతో ఐపీఎల్‌లో ఈ వెస్టిండీస్ దిగ్గజం క్రియేట్ చేసిన రికార్డులు అలాంటివి. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. గేల్ ఇప్పటివరకు 357 సిక్సులు బాదాడు. వీటితోపాటు 405 ఫోర్లు కూడా బాదాడు. ఐపీఎల్‌లో మొత్తంగా 142 మ్యాచ్‌లాడిన గేల్ 39 సగటుతో 4965 పరుగులు చేశాడు. ఇందులో 31 హాఫ్ సెంచరీలు, 6 సెంచరీలు ఉన్నాయి.

రెండు, మూడు స్థానాల్లో వాళ్లే
ఇక ఈ జాబితాలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిల్లియర్స్ రెండో స్థానంలో ఉన్నాడు. డివిల్లియర్స్ ఐపీఎల్‌లో 251 సిక్సులు బాదాడు. మొదటి స్థానంలో ఉన్న గేల్‌కు, రెండో స్థానంలో ఉన్న డివిల్లియర్స్‌కు 106 సిక్సులు తేడా ఉండడం గమనార్హం. వీటితోపాటు డివిల్లియర్స్ 413 ఫోర్లు కూడా బాదాడు. మొత్తంగా 184 మ్యాచ్‌లాడి 39 సగటుతో 5162 పరుగులు చేశాడు. ఇక ఈ జాబితాలో 227 సిక్సులతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ 491 ఫోర్లు కూడా బాదాడు. మొత్తంగా 213 మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 31 సగటుతో 5611 పరుగులు చేశాడు.

4, 5 స్థానాల్లో..
నాల్గో స్థానంలో చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. ధోని ఖాతాలో 219 సిక్సులు ఉన్నాయి. అదే సమయంలో ధోని 325 ఫోర్లు కూడా బాదాడు. మొత్తంగా 220 మ్యాచ్‌లాడి 39 సగటుతో 4746 పరుగులు చేశాడు. ఇక ఐదో స్థానంలో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డు ఉన్నాడు. పొలార్డు ఖాతాలో 214 సిక్సులు ఉన్నాయి. అదే సమయంలో 212 ఫోర్లు కూడా బాదాడు. మొత్తంగా 178 మ్యాచ్‌ల్లో 29 సగటుతో 3268 పరుగులు చేశాడు. ఇందులో 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 65 వికెట్లు కూడా సాధించాడు.
మరో 5 రోజుల్లో
ఇక అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మరో 5 రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నె 26న జరగనున్న తొలి మ్యాచ్‌లో గత సీజన్లో ఫైనల్ చేరిన కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నైసూపర్ కింగ్స్ తలపడున్నాయి. కాగా మ్యాచ్‌లను వీక్షించడానికి 50% ప్రేక్షకులను బీసీసీఐ స్టేడియాల్లోకి అనుమతించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












